ఇండియా పేరుపై బీజేపీ ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండియా పేరును భారత్ గా మార్చాలని డిమాండ్ చేశారని తెలుస్తోంది.
బ్రిటిష్ వారు ఇండియా పదాన్ని దుర్వినియోగం చేశారన్న ఎంపీ హరనాథ్ సింగ్ యాదవ్ భారత రాజ్యాంగంలోని ఇండియా అనే పదం స్థానంలో భారత్ అని పెట్టాలని సూచించారు.ఇదే విషయాన్ని దేశం అంతా డిమాండ్ చేస్తోందన్నారు.
భారత్ అనే పదం మన సంస్కృతికి ప్రతీక అన్న ఆయన రాజ్యాంగంలో మార్పు రావాలని కోరారు.అయితే మరోవైపు ఇవాళ రాష్ట్రపతి భవన్ ఇన్విటేషన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు.
దీంతో ఇండియా పేరుపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.