సీనియర్ల పై బాబు గుస్సా ! వలసలపై ఆందోళన

ప్రజలు నన్ను నమ్ముతున్నా… నాయకుల నన్ను నమ్మడం లేదనే బాధ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లో ఎక్కువగా కనిపిస్తోంది.పార్టీ గెలుపు కోసం తాను నిరంతరం కష్టపడుతూ.

 Chandrababu Naidu Serious On Tdp Seniors-TeluguStop.com

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కనీస విశ్రాంతి లేకుండా శ్రమిస్తుంటే… పార్టీ నాయకులు అవి ఏమీ అర్థం చేసుకోకుండా వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలవదనే ఉద్దేశంతో ఉన్నారని బాబు భావిస్తున్నాడు.అందుకే అప్పుడే తమ ముఖ్య అనుచరులను బంధువులను తమ ప్రత్యర్థి పార్టీ లో చేర్పిస్తూ అదును కోసం చూడడం చంద్రబాబులో మరింత ఆగ్రహాన్ని పెంచుతోంది.

ఈ విషయంలో చోటా మోటా నాయకులు ఎలా ఉన్నా… సుదీర్ఘ కాలం తనతో పనిచేసి పార్టీ సీనియర్లు గా గుర్తింపు ఉన్న నాయకులు ఇటువంటి సంఘటనలకు పాల్పడడం బాబుకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి గెలుస్తుందని సీనియర్లకే నమ్మకం లేకపోతే ఎలా అంటూ తన సన్నిహితుల వద్ద బాబు ఆవేదన చెందుతున్నారు.ఈ ఎన్నికల్లో టిడిపి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదంటూ కొంతమంది మంత్రులు సీనియర్లు బాహాటంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కిందిస్థాయి క్యాడర్లో ఒక రకమైన భయం తో ఇస్తున్నారని బాబు బాధపడుతున్నాడు.

తాజాగా కొంతమంది నాయకులు టిడిపిని వీడి వైసీపీలో చేరడం బాబుకి మింగుడు పడడం లేదు.

తాను నమ్ముకున్న నాయకులే సొంత కుటుంబ సభ్యులను బంధువులను వైసీపీలో చేర్చడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు తనకు అత్యంత నమ్మకస్తులైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన బావ అల్లుడు వైసీపీలో చేరడం బాబు తట్టుకోలేకపోతున్నారు.

గత ఎన్నికల్లో సోమిరెడ్డి ఓడిపోయినప్పటికీ తాను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కూడా ఇచ్చానని, కానీ ఆయన తన బంధువులే వైసీపీలోకి వెళ్తుంటే అడ్డుకోలేకపోయారని బాబు బాధపడుతున్నాడు.

ఒకవేళ నిజంగా టిడిపి అధికారంలోకి రాకపోతే … ఐదేళ్లు భరించలేరా …? పార్టీ కోసం మీరు చేసేది ఇదేనా …అంటూ బాబు సోమిరెడ్డి నుద్దేశించి కొంతమంది నాయకులు వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏదో రకంగా పొత్తు పెట్టుకుని 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని కిందిస్థాయి నాయకులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే చంద్రబాబు మాటలను మాత్రం టీడీపీ సీనియర్ లు ఎవరు విశ్వసించినట్టు కనిపించడంలేదు.

అందుకే తెర వెనుక వైసీపీ, జనసేన పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube