కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించేంత వరకు అనర్హుడిగానే పరిగణించాలని లక్నోకు చెందిన న్యాయవాది అశోక్ పాండే కోర్టులో పిటిషన్ వేశారు.
దొంగలు అందరికీ మోదీ ఇంటి పేరు ఎందుకు అనే వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను గతంలో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.కోర్టు ఆదేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడింది.