ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను చూస్తుంటే హృదయ విధారకం కలగక మానదు.అంతేగాక ఇంతటి క్రూర ప్రపంచంలో మనం మనుగడ సాగిస్తున్నామా అనే సందేహం కూడా ఒక్కోసారి కలుగుతుంది.
తాజాగా మూగ జీవం అయినటువంటి పిల్లిని ఓ మైనర్ బాలుడు తన మిత్రులతో కలిసి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని ఓ మారుమూల ప్రాంతంలో ఓ యువతి ఎంతో ఇష్టపడి తన స్నేహితుల ద్వారా పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటోంది.
అయితే ఇటీవలే యువతి పని నిమిత్తమై బయటకు వెళ్లి వచ్చి చూసే సరికి పిల్లి అపస్మారక పడి ఉండడాన్ని గమనించింది.అంతేగాక పిల్లి జననాంగాల వద్ద రక్తస్రావం అవుతూ ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరవుతు దగ్గరలో ఉన్నటువంటి జంతు వైద్యశాలకి చికిత్స నిమిత్తం తీసుకెళ్ళింది.
వైద్య చికిత్సలు పిల్లికి వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం డాక్టర్లు చెప్పినటువంటి విషయాన్ని విని ఒక్కసారిగా యువతి ఖంగు తింది.
వైద్యులు పిల్లి పై దారుణంగా అత్యాచారం జరిగిందని అందువల్లే తీవ్ర రక్తస్రావానికి గురై మరణించిందని తెలిపారు.
దీంతో వెంటనే యువతి తన ఇంటికి వెళ్లి మైనర్ బాలుడిని ఈ విషయం గురించి నిలదీయగా తానే తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.దీంతో వెంటనే యువతి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించింది.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి మూగజీవాలను హింసించి హత్య చేసినందుకుగాను మైనర్ బాలుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.అంతేగాక బాలుడితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన టువంటి మరో ఇద్దరి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.