నకిలీ పత్రాలతో వీసాలు( Fake Visa ) సంపాదించి కెనడాలో ( Canada ) అడుగుపెట్టిన విదేశీ విద్యార్ధులు చిక్కుల్లో పడ్డారు.ఇందుకు గాను వారిని దేశం నుంచి బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
బాధితుల్లో భారతీయ విద్యార్ధులు( Indian Students ) కూడా ఉండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ లిస్ట్‌లో దాదాపు 150 మంది వరకు పంజాబ్( Punjab ) రాష్ట్రానికి చెందిన విద్యార్ధులే వున్నారు.
ఈ క్రమంలో విద్యార్ధుల తరపున కెనడాలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) రంగంలోకి దిగింది.పంజాబీ విద్యార్ధులను దేశం నుంచి బహిష్కరించవద్దని ఎన్‌డీపీ.
ప్రభుత్వాన్ని కోరింది.
మే 29 నాటికి సదరు విద్యార్ధులు దేశం నుంచి వెళ్లిపోవాలని కెనడా ప్రభుత్వం అందరికీ నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.అయితే ఇమ్మిగ్రేషన్ కన్సల్టేషన్ ఏజెన్సీ తమకు నకిలీ పత్రాలను అందించి మోసం చేసిందని, వాటి గురించి తమకు తెలియదని వారు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్‌డీపీ స్పందించింది.రిక్రూటర్ల మోసం వల్ల ఇప్పటికే నష్టపోయిన విద్యార్ధులు మూల్యం చెల్లించుకోవాల్సి రావడం బాధాకరమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మోసపూరిత ట్రావెల్ డాక్యుమెంటేషన్‌ను పొందిన విద్యార్ధులకు సహాయం చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని తాను ఇమ్మిగ్రేషన్ మంత్రి సీన్ ఫ్రేజర్‌కు మే 25న లేఖ రాశానని.ఎన్‌డీపీకి చెందిన జెన్నీ క్వాన్ ( Jenny Kwan ) పేర్కొన్నారు.
అయితే నకిలీ డాక్యుమెంట్లతో దేశంలోకి వచ్చిన విద్యార్ధులకు తాము జరిమానా విధించడం లేదని, కేవలం నిందితులను గుర్తించడంపైనే తాము దృష్టి పెడుతున్నట్లు మంత్రి ఫ్రేజర్( Minister Sean Fraser ) గతంలోనే ట్వీట్ చేశారు.దీనిపై స్పందించిన క్వాన్.విద్యార్ధులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరారు.క్రమబద్ధీకరణ కార్యక్రమం విస్తృతమైనదే అయినప్పటికీ మానవతా దృక్పధంతో దీనిని చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.బాధిత విద్యార్ధులలో కొందరు ఇప్పటికే కెనడాలో ఐదేళ్లకు పైగా గడిపారని.చదువుల కోసం ఫీజులను కూడా చెల్లించారని ఆమె గుర్తుచేశారు.
అందువల్ల ఈ బహిష్కరణలను ఆపడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా క్వాన్ ప్రభుత్వాన్ని కోరారు.
కాగా.కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ప్రకారం దాదాపు 700 మంది భారతీయ విద్యార్ధులు బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.నకిలీ ఆఫర్ లెటర్స్‌తో అడ్మిషన్ సంపాదించారన్నది వీరిపై వున్న అభియోగం.
ఈ విద్యార్ధులలో ఎక్కువమంది 2018, 2019లలో చదువుకోవడానికి కెనడా వచ్చారు.అయితే కెనడాలో శాశ్వత నివాసం కోసం విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ మోసం వెలుగుచూసింది.