వీసా దరఖాస్తుల క్లియరెన్స్‌లో కెనడా రికార్డు.. ఈ ఏడాది 4.8 మిలియన్ల వీసాల జారీ..!!

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజిస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ) ప్రకారం.2022లో ఆ దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా 4.8 మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.గతేడాది ఇదే కాలంలో కేవలం 2.5 మిలియన్ల దరఖాస్తులను ప్రాసెస్ చేయగలిగింది.నెలవారీ ప్రాతిపదికన .కెనడా ఇప్పుడు మరిన్ని విజిటర్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేస్తోంది.ఈ నవంబర్‌లో 2,60,000 విజిటర్ వీసాలు ప్రాసెస్ చేయబడ్డాయి.2019లో ఇదే సమయంలో వీటి సంఖ్య 1,80,000 మాత్రమే.

 Canada Issues Record-breaking 4.8 Million Visas In 2022 ,ircc Minister Sean Fras-TeluguStop.com

ఈ సందర్భంగా ఐఆర్‌సీసీ మంత్రి సీన్ ఫ్రేజర్ మాట్లాడుతూ… ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు.

కెనడాలో పని చేయడానికి, చదువుకోవడానికి, సందర్శించడానికి , స్ధిరపడేందుకు వచ్చే కొత్త వారిని స్వాగతిస్తున్నామని ఫ్రేజర్ పేర్కొన్నారు.ఐఆర్‌సీసీ డేటా ప్రకారం.4.8 మిలియన్ దరఖాస్తుల్లో 6,70,000 స్టడీ పర్మిట్లు.7,00,000 వర్క్ పర్మిట్లు, వేలాది విజిటర్ వీసాలు వున్నాయి.

నవంబర్ 30 నాటికి 6,70,000 స్టడీ పర్మిట్‌లు క్లియర్ చేయబడ్డాయి.

గతేడాది ఇదే సమయంలో 5,00,000కు పైగా టెంపరరీ రెసిడెన్స్ కేటగిరీ కింద దరఖాస్తులు ప్రాసెస్ చేయబడ్డాయి.కొత్త స్టడీ పర్మిట్‌లు ప్రస్తుతం 60 రోజుల సర్వీస్ స్టాండర్డ్‌లో ప్రాసెస్ చేయబడుతున్నాయని ఐఆర్‌సీసీ గణాంకాలు చెబుతున్నాయి.

Telugu Canada, Canada Visas, Temporary-Telugu NRI

వర్క్ పర్మిట్ల విషయానికి వస్తే.నవంబర్ 30 నాటికి దాదాపు 7,00,000 వర్క్ పర్మిట్లు ప్రాసెస్ చేయబడ్డాయి.కోవిడ్ 19కి ముందు 2019లో ఇదే కాలంలో వీటి సంఖ్య 2,23,000గా వున్నాయి.2021లో కెనడా రికార్డు స్థాయిలో 4,05,000 మంది కొత్త శాశ్వత నివాసితులను స్వాగతించింది.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 2,51,000 మంది కొత్త పౌరులకు అనుమతించింది.దీని కారణంగా పౌరసత్వ జాబితాలోని 70 శాతానికి దరఖాస్తులు ఇప్పుడు సర్వీస్ స్టాండర్డ్స్‌లో వున్నాయి.

తీవ్రమైన కార్మికుల కొరతను పరిష్కరించేందుకు 2025 నాటికి ప్రతి ఏడాది అర మిలియన్ వలసదారులను స్వాగతించడానికి కెనడా తన కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికలను గత నెలలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube