బైట్ డ్యాన్స్ కు మరో దెబ్బ,రాజీనామా బాటలో కీలక వ్యక్తి!

టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఇప్పటికే భారత్ లో టిక్ టాక్ పై నిషేధం విధించడం తో తీవ్రంగా నష్టపోయిన ఆ సంస్థ కు ఇప్పుడు మరో రూపంలో మరింత నష్టం కలిగించే పరిస్థితి ఏర్పడింది.ఆ సంస్థలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.100 బిలియన్ డాలర్ల కంపెనీ గా ఎదిగిన బైట్ డ్యాన్స్ కు ఇప్పుడు ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో నష్టం చేకూరింది.ఒక్క ఏడాది గ్యాప్ లోనే 33 శాతం కంపెనీ వాల్యుయేషన్ పెరిగిపోగా, ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం తో ఆ సంస్థ ఒక్కసారిగా కుదేలయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు.భారత్ ఆ యాప్ పై నిషేధం విధించడం తో అటు అమెరికా,ఆస్ట్రేలియా లతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తుంది.

 Head Of Tiktok Parent Company Bytedance Is Going To Leave Company In This Week,-TeluguStop.com

అయితే ఇప్పటికే 6 బిలియన్ డాలర్లు నష్టం వాటిల్లడం తో కోలుకోలేని పరిస్థితి లో ఉన్న ఆ సంస్థ కు ఇప్పుడు కీలక పదవిలో ఉన్న వ్యక్తి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది.సంస్థ ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటల్లిజెన్స్) ల్యాబ్ హెడ్ వెయ్-ఇంగ్ మా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

వెయ్-ఇంగ్ 2017లో మైక్రోసాఫ్ట్ నుంచి బైట్‌డాన్స్‌కు రాగా, అప్పటి నుంచి సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా, ఏఐ ల్యాబ్ హెడ్‌గా ఆయన కొనసాగారు.అయితే వచ్చే వారంలో సంస్థ నుంచి వైదొలగనున్నట్లు సమాచారం.

అయితే ఆయన పదవి కి రాజీనామా ఎందుకు చేస్తున్నారు అన్న కారణాలు మాత్రం వెల్లడికాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube