'బిజినెస్ మేన్' రీ రిలీజ్ క్లోసింగ్ కలెక్షన్స్..'ఖుషి' రికార్డ్స్ సేఫ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( mahesh babu )కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ తో చేసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం.అప్పటి వరకు క్లాస్ ఇమేజి ఉన్న మహేష్ బాబు కి పూరి జగన్నాథ్ మాస్ ఇమేజి ని తెచ్చిపెట్టాడు.

 'business Man' Re-release Closing Collections..'khushi' Records Safe, Pokiri Mo-TeluguStop.com

వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ చిత్రం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని షేక్ చేసింది.ఆరోజుల్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన ఈ సినిమాని తమిళం , హిందీ, కన్నడ బాషలలో రీమేక్స్ చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నారు.

ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ‘బిజినెస్ మేన్’.ఈ చిత్రం పోకిరి రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కాదు కానీ, కల్ట్ క్లాసిక్ స్టేటస్ ని మాత్రం దక్కించుకుంది.

ఈ చిత్రానికి మాస్ లోనే కాదు, యూత్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

Telugu Businessman, Chiranjeevi, Khushi, Mahesh Babu, Pawan Kalyan, Pokiri, Raji

అంతే కాకుండా తమిళం మరియు హిందీ ఆడియన్స్ ని కూడా ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది.ఇందులో మహేష్ బాబు నటన గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.అలాంటి సినిమాని రీసెంట్ గానే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9 వ తారీఖున విడుదల చేసారు.

ఈ సినిమాకి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఖుషి మొదటి రోజు వసూళ్లు 4 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ ని అతి తేలికగా బ్రేక్ చేసింది ఈ చిత్రం.

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబట్టింది.కానీ ఫుల్ రన్ లో మాత్రం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ‘ఖుషి( Khush )’ రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొట్టలేకపోయింది ఈ చిత్రం.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు కేవలం 5 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది.

Telugu Businessman, Chiranjeevi, Khushi, Mahesh Babu, Pawan Kalyan, Pokiri, Raji

ఖుషి చిత్రం దాదాపుగా ఫుల్ రన్ లో 8 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది.ఇది ఆల్ టైం రికార్డు, బిజినెస్ మేన్ కి ఈ రికార్డు ని బద్దలు కొట్టే కెపాసిటీ ఉంది కానీ, చిరంజీవి( Chiranjeevi ) మరియు రజినీకాంత్( Rajinikanth ) సినిమాలు ఉండడం వల్ల ఆ సినిమాల కోసం ఈ చిత్రాన్ని థియేటర్స్ నుండి తీసి వెయ్యాల్సి వచ్చింది.అయితే ఖుషి ఫుల్ రన్ రికార్డుని బ్రేక్ చేయలేకపోయినా, మొదటి రోజు రికార్డు ని మాత్రం భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది.

మరి ఈ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగష్టు 31 వ తేదీన ‘గుడుంబా శంకర్ ‘ తో బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube