ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మాకొద్దు ఈ కరోనా అని అనుకుంటున్నారు.కానీ విచిత్రంగా ఆ దీవిలోకి అడుగుపెట్టాలి అంటే మాత్రం తప్పనిసరిగా కరోనా పాజిటివ్ రావాల్సిందేనట.
ఇంతకీ ఆ దీవి ఏంటి? ఎక్కడ ఉంది? దాని వివరాలు తెలుసుకోవాలని ఉందా.ఇంతకీ ఆ దీవి ఎక్కడ ఉందంటే బ్రెజిల్ లో ఉందట.
బ్రెజిల్ లోని పెర్నంబుకో స్టేట్ లో ఫెర్నాండో డి నొరాన్హా అనే దీవుల సమూహం ఒకటి ఉంది.ఒకప్పుడు ఈ దీవులకు లక్షల సంఖ్యలో జనాలు వచ్చి విహార యాత్రలు చేసుకొని వెళ్ళిపోయేవారు.
ఈ ద్వీప సమూహానికి వరల్డ్ బెస్ట్ బీచ్ అవార్డు కూడా లభించింది అంటే అర్ధం చేసుకోవచ్చు.అయితే ఈ కరోనా మహమ్మారి రావడం తో ఇప్పుడు ఒక్క పురుగు కూడా ఆ ప్రాంతానికి రావడానికి సుముఖత చూపడంలేదు.
దీనితో ఆ దీవులు బోసిపోయాయట.అయితే వచ్చే వారం ముంచి ఆ దీవులను తిరిగి ప్రారంభించాలని అధికార వర్గాలు సిద్దమౌతున్నట్లు తెలుస్తుంది.
తిరిగి ఆ దీవులు ప్రారంభంకానుండడం తో ప్రపంచంలో కరోనా తగ్గిపోయిందా అందుకే ఆ దీవులు తిరిగి ప్రారంభిస్తున్నారా అని ఆలోచిస్తున్నారా.అదేమీ లేదు.
ఇంత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ దీవులను తిరిగి ప్రారంభించడం ఒక విచిత్రం అయితే, మరో విచిత్రం ఏమిటంటే ఎవరికి అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వారికి మాత్రమే ఆ దీవిలోకి ప్రవేశం ఉంటుందట.కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
అది కూడా పీసీఆర్ టెస్టులో వచ్చిన ఫలితాన్నే పరిగణనలోకి తీసుకుంటారు.
అంతేకాదు, 20 రోజుల లోపు పరీక్ష చేయించుకుని ఉండాలట.
కానీ నిబంధనలు అయితే పెట్టింది కానీ ఆ నిబంధనల వెనుక ఉన్న అసలు విషయం మాత్రం వెల్లడించలేదు అధికారులు.మొత్తానికి కరోనా ఉంటె ఎక్కడకి వెళ్లకూడదు అని అందరూ ఇళ్లకే పరిమితమైపోతున్నారు.
అయితే కరోనా ఉంటేనే మా దీవులకు రండీ అంటూ వారు ఆహ్వానం పలుకుతుండడం మాత్రం విచిత్రంగానే ఉంది.