బ్రహ్మాస్త్ర కలెక్షన్స్‌... ఎవరికీ అంతు చిక్కని బ్రహ్మ పదార్థం అయ్యింది బాబోయ్

బాలీవుడ్ బ్రహ్మాస్త్ర వసూళ్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.సినిమాకు రివ్యూ లు నెగటివ్ గా వచ్చాయి.

 Brahmastra Movie Collections Going Social Media Viral , Alia Bhatt, Brahmastra ,-TeluguStop.com

ప్రేక్షకుల స్పందన కూడా నెగిటివ్ గానే ఉంది అయినా వసూళ్లు మాత్రం వందల కోట్లు నమోదు అవుతుండడం ఆశ్చర్యకరంగా ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు లో రాజమౌళి సమర్పించాడు కనుక బ్రేక్ ఈవెన్‌ సాధ్యం.

కానీ ఇతర భాషల్లో ఈ సినిమా ఎలా బ్రేక్ ఈవెన్ కి దూసుకెళ్తుంది అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.ఏదైనా ఒక పదార్థం గురించి.

లేదంటే విషయం గురించి ఎవరికీ అంతు చిక్కకపోతే దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు.ఇప్పుడు బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ కూడా ఒక బ్రహ్మ పదార్థం అయినట్లుగా మారి పోయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

నిజంగానే బ్రహ్మాస్త్ర సినిమా ఈ స్థాయి వస్తువులను నమోదు చేస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ సాక్షాదారాలతో సహా మీడియాకు చెందిన వారు ఈ కలెక్షన్స్ ని వెల్లడిస్తుండడంతో చిత్ర యూనిట్ సభ్యులకి కలెక్షన్స్ కి ని ప్రకటించడం లేదు.

కనుక నిజమైన కలెక్షన్స్ అయ్యి ఉంటాయి అని కొందరు మీడియా వర్గాల వారు నమ్ముతున్నారు.ఈ సినిమా బాగాలేదు అనుకుంటనే ఒక భారీ సినిమా కనుక చూద్దాం ఎలా ఉందో.

అలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు ఎలా చేశారో ఒక సారి చూద్దాం అన్నట్లుగా ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.వచ్చే వీకెండ్ కూడా భారీ వసూలు నమోదయ్యే అవకాశముంది.

దాంతో ఈ సినిమా 300 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ అదే కనుక నిజమైతే కచ్చితంగా ఈ సినిమా ఒక అద్భుతం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇప్పటికే అమెరికాలో కేజిఎఫ్ 2 యొక్క వసూళ్లను బ్రహ్మాస్త్ర క్రాస్ చేసి సంచలనం సృష్టించింది.ఇండియాలో కూడా అదే స్థాయిలో వస్తువులని సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube