వైరల్: ఈ కుర్రాడి గొంతులో మ్యాజిక్ వుందంటున్న నెటిజన్లు... కారణం ఇదే!

అమర్‌జీత్ జయకర్.( Amarjeet Jayakar ) ఈ పేరుకి ఈ పెద్దగా పరిచయం అక్కర్లేదు.

 Boy Singing A Song With Amazing Voice Video Goes Viral Details, Amarjeet Jayakar-TeluguStop.com

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇతడి పేరు బాలీవుడ్ అంతటా మార్మోగింది.అందుకు కారణం ఈ యువకుడు అత్యంత మధురమైన గాత్రం కలిగి ఉండటమేనని చెప్పవచ్చు.

తాజాగా ఈ యువకుడు మరోసారి తన గానామృతంతో అందర్నీ ఫిదా చేస్తున్నాడు.బిహార్‌ రాష్ట్రం,( Bihar ) సమస్తిపూర్‌లో నివసించే అమర్జీత్ పెద్ద సింగర్ ఏమీ కాదు.

మామూలు పనులు చేసుకుంటూ జీవిస్తాడు.అయితే దేవుడు అతడికి అతి మధురమైన గాత్రాన్ని అందించాడు.

గాత్రంతో( Singing ) ఇతను పనులు చేసుకుంటూ పాడుతుంటాడు.

అయితే ఆ యువకుడి వాయిస్ విన్న వారంతా ఆశ్చర్యపోతుంటారు.

మరి కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.అలా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ గా మారింది.

ఈ వైరల్ వీడియోలో అమర్జీత్ ఒక ఇంట్లో కూర్చుని, పొలంలో పంటను ఏరి దానిని కట్టగా చుట్టడం చూడవచ్చు.ఈ పనిని చేస్తూ అతడు తన గొంతుకు పని చెప్పాడు.

వైరల్ వీడియోలో నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాడిన బ్లాక్‌బస్టర్ సాంగ్ ‘తుమ్హే దిల్లాగీ భూల్ జానీ పడేగీ’ని ఈ యువకుడు ఆలపించడం ప్రారంభించాడు.చాలా బ్యూటిఫుల్ గా అతను పాడుతూ మైమరిచిపోయేలా చేశాడు.ఈ పాటను అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు.దీనికి సరదాగా ‘ఆదత్ సే మజ్బూర్ సింగర్’ అని ఒక క్యాప్షన్ జోడించాడు.

ఈ కుర్రాడు సింగింగ్ టాలెంట్ చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.మరికొందరు ఇతరులతో పంచుకుంటున్నారు.అలా షేర్ చేసిన వారం రోజుల్లోనే ఈ వీడియోకు 96 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి, 12 వేల లైకులు వచ్చాయి.వందల్లో కామెంట్లు వచ్చాయి.అన్ని కామెంట్లలో అతడిపై ప్రశంసలే ఉన్నాయి.వావ్ మీ వాయిస్ సూపర్ గా ఉంది, గొంతులో ఏదో మ్యాజిక్ ఉందని చాలామంది కామెంట్లు చేస్తారు.

దీనిపై మీరు కూడా ఒక లుక్కెయ్యండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube