ఏనుగులతో సెల్ఫీ కోసమని వెళ్లిన యువకులు.. కానీ చివరికి ఏమైందంటే..?

స్మార్ట్‌ఫోన్లు ప్రతిఒక్కరి చేతుల్లోకి రావడం, సోషల్ మీడియా బాగా పాపులర్ అవ్వడంతో చాలామందికి సెల్పీల పిచ్చి( Selfie ) పట్టుకుంది.సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో తాము సందర్శించిన ప్రాంతాలతో పాటు తమ ఫొటోలు, తమ స్నేహితులతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు.

 People Taking Selfies Ran Away Upon Seeing The Elephants Anger Details, Elephant-TeluguStop.com

తమ ఫొటోలకు వచ్చే లైక్ లు, కామెంట్లు చూసి మురిసిపోతూ ఉంటారు.ఇక సెల్పీల మోజులో పడి చాలామంది విన్యాసాలు చేస్తూ ఉంటారు.

ఇలా చేసి ప్రాణాలను పొగోట్టుకునే పరిస్థితికి వస్తున్నారు.తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

ఏనుగుల గుంపుతో( Elephants ) సెల్పీలు దిగాలని చూసిన యువతకు ఊహించని పరిణామం ఎదురైంది.ఏనుగులతో సెల్పీ దిగేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు.కానీ వీళ్లు సెల్పీలు దిగుతుండగా ఏనుగుల గుంపుకు తిక్కరేగింది.దీంతో సెల్పీలు తిగుతుండగా వారి వెంట పడి వెంబడించాయి.దీంతో యువకులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని కిందమీద పడుతూ పరుగులు తీశారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ గా మారింది.

అస్టేం ఫైన్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దాదాపు 50 ఏనుగుల గుంపు పాలియా గౌరీఫాంట రహదారిపై వెళుతున్నాయి.అటుగా వెళ్తున్న ముగ్గురు యువకులు దీనిని గమనించి సెల్పీలు దిగేందుకు ప్రయత్నం చేశారు.కొందరు ఏనుగుల గుంపులోని మందను పరిగెత్తేలా చేశారు.దీంతో ఏనుగులు యువకులను వెంబడించగా.ఒక యువకుడు కిందపడ్డాడు.

అయితే మరో యువకుడు దీనిని వీడియో తీశాడు.ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

దుద్వా టైగర్ ఫారెస్ట్( Dudhwa Tiger Forest ) అధికారులు ఈ వీడియోను ఇంకా ధృవీకరించలేదు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు.

యువకుల తిక్క కుదిరింది అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube