కార్డ్‌బోర్డ్‌తో సూపర్ మారియో గేమ్‌ను తయారు చేసిన బాలుడు.. వీడియో వైరల్...

90వ దశకంలో పెరిగిన చాలా మంది వ్యక్తులు సూపర్ మారియో( Super Mario ) వీడియో గేమ్‌ను ఆడటం ఇష్టపడ్డారు, ఇందులో మారియో అనే పాత్రను కంట్రోల్ చేస్తూ డ్రాగన్ నుంచి యువరాణిని రక్షించాలి.సూపర్ మారియో చాలా పాపులర్ అయింది.

 Boy Made Super Mario Game Out Of Cardboard Video Viral Details, Super Mario, Vid-TeluguStop.com

దానిని తయారు చేసిన నింటెండో కంపెనీకి చాలా కాపీలు అమ్ముడయ్యాయి.నిజానికి ఇప్పటికీ కొన్ని డివైజ్‌ల్లో సూపర్ మారియోను ప్లే చేయవచ్చు.

నింటెండో సూపర్ మారియో కొత్త వెర్షన్‌ను పేపర్ మారియో అని కూడా పిలిచింది, ఇక్కడ ప్రతిదీ కాగితంతో తయారు చేయబడినట్లుగా కనిపిస్తుంది.

అయితే ఏ పరికరం లేదా విద్యుత్ అవసరం లేకుండా సూపర్ మారియో ఆడాలని ఒక బాలుడు ఆలోచించాడు.కార్డ్‌బోర్డ్‌తో( Cardboard ) సూపర్ మారియో గేమ్‌ను తయారు చేయాలనే ఒక ఆలోచన అతడికి వచ్చింది.ఇంకేముంది అదే ఆచరణలో పెట్టాడు.

వెనిజులాకు( Venezuela ) చెందిన ఈ బాలుడు తన చేతులతో సూపర్ మారియో ఆడగలిగే స్లాట్‌ను రూపొందించడానికి పాత కార్డ్‌బోర్డ్ పెట్టె, కొన్ని బాటిల్ క్యాప్‌లను ఉపయోగించాడు.అతను కార్డ్‌బోర్డ్ నుంచి మారియో, శత్రువులు, నాణేలు, ప్లాట్‌ఫామ్‌ల ఆకారాలను కత్తిరించాడు, వాటిని తీగలకు జోడించాడు.

మారియోను( Mario ) ఎడమ, కుడికి మూవ్ చేయడానికి, దూకడానికి, పరిగెత్తడానికి అతను బాటిల్ క్యాప్‌లను కంట్రోలర్లుగా ఉపయోగించాడు.

ఆ బాలుడు తన కార్డ్‌బోర్డ్ సూపర్ మారియో గేమ్ ఆడుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.చాలా మంది దీన్ని చూసి లైక్ చేసారు.బాలుడి సృజనాత్మకత, నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు.

అతను ఎటువంటి సహాయం లేదా సాంకేతికత లేకుండా తన సొంత సూపర్ మారియో గేమ్‌ను తయారు చేయడం నిజంగా గొప్ప విషయం అని అంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube