Bus Depot Wall Collapses: బస్టాండ్‌లో కాంపౌండ్ వాల్ కూలి బాలుడు నుజ్జునుజ్జు.. షాకింగ్ వీడియో వైరల్!

మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో ఎవరూ చెప్పలేరు.అనుకోకుండా వచ్చే మరణం చాలా బాధను మిగుల్చుతుంది.

 Boy Died After Bus Depot Wall Collapses In Maharashtra Details, Maharashtra, Pal-TeluguStop.com

మరీ ముఖ్యంగా యవ్వనంలోకి కూడా అడుగుపెట్టకుండా చనిపోతే వారి తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.కాగా తాజాగా ఒక ఘటన అలాంటి కడుపుకోతను తల్లిదండ్రులకు మిగిల్చింది.

అభం శుభం తెలియని చిన్నపిల్లాడు చేయని తప్పుకు బలైపోయాడు.మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో బస్ డిపోలో అతడు ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బస్ డిపోలోని కాంపౌండ్ వాల్ కూలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.రివర్స్‌లో వెళ్తున్న బస్సు గోడను ఢీకొట్టడంతో అది కూలిపోయింది.

ఆ సమయంలో కొంతమంది పిల్లలు గోడ పక్కనే ఉన్నారు.అయితే ముగ్గురు గోడ కూలుతుండడాన్ని గమనించి వెంటనే తప్పించుకోగలిగారు.

ఒక 11 ఏళ్ల బాలుడు మాత్రం సరిగ్గా గోడ కింద పడిపోయాడు.ఆ గోడ చాలా లావుగా ఉండటంతో, అలాగే అది అమాంతం అతడి శరీరం పై పడడంతో నుజ్జు నుజ్జు అయిపోయాడు.

అక్కడే ఉన్నవారు త్వరితగతిన ఆ శిథిలాలను తొలగించినా ఫలితం లేకపోయింది.

ఈ ఘటనపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.డ్రైవర్ రివర్స్ చేస్తుండగా జవహర్ డిపో కాంపౌండ్ వాల్‌ను బస్సు ఢీకొట్టిందని తెలిపారు.దీంతో పక్కనే నిల్చున్న వారిపైకి గోడ కూలింది.

దీంతో 11 ఏళ్ల చిన్నారి మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ ఘటనలో 15 ఏళ్ల బాలుడు కూడా గాయపడ్డాడని ఆయన తెలిపారు.ఈ పిల్లలు తమ బంధువులను కలవడానికి జవహర్ బస్టాండ్‌కు వచ్చారు.11 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.గాయపడిన వ్యక్తి కూడా చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube