వైరల్: నాన్నను అనుకరిస్తున్న బాలుడు... నెటిజన్లు తెగ ఇరగబడి నవ్వుతున్నారు!

విజయవంతంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేసాం.ఈ రోజున స్మార్ట్ ఫోన్లు అనేకరకాల సందేశాలతో నిండిపోయి ఉంటాయి.

 Boy Adorably Imitates Dad Watching Football Match On Tv,viral Video,football Mat-TeluguStop.com

ఇక సోషల్ మీడియా అయితే చెప్పనవసరం లేదు.ఈరోజు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అయ్యి ఉంటాయి.

ఆ సంగతి పక్కన బెడితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.ఆ బాలుడి వయసు అటుఇటుగా రెండు సంవత్సరాలు వుంటాయేమో.

వీడియోని బట్టి చూస్తే అతనికి ఆనందానికి, దుఃఖానికి కారణం ఏంటో ఇంకా అర్ధం అయినట్టు లేదు.తన తండ్రి దిగులుగా ఉండడం చూసి.

తాను కూడా విచార పడటం, సంతోషించించగానే తనుకూడా సంతోషించడం చేస్తున్నాడు.
చిన్న పిల్లకు సంబంధించిన వీడియో కావడం వలన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

లోకం తెలియని పసివాళ్లు తమ కనుల ముందు కనిపించిన విషయాలను త్వరగా అనుకరిస్తూ వుంటారు.మరీ ముఖ్యంగా తమ తల్లితండ్రులను బాగా ఫాలో అవుతారు.అలాంటి ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది.విషయంలోకి వెళితే, ఇక్కడ వీడియోలో తండ్రితో కలిసి చిన్నారి బాలుడు మ్యాచ్ ని చూస్తున్నాడు.

ఈ సమయంలో అతని తండ్రి ఎగ్జైట్ మెంట్ చేసిన పనిని చూసి పిల్లవాడు కూడా కాపీ కొట్టడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో తండ్రిలాగే కొడుకు కూడా విసుగు చెంది దిగులుగా సోఫాలో వాలిపోయిన దృశ్యం చూస్తుంటే బాగా నవ్వొస్తుంది.@buitengebieden అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడిన ఈ వీడియో నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుంది.కాగా ఈ వీడియోని 44 లక్షల మందికి పైగా చూడగా వేలసంఖ్యలో లైక్స్ చేస్తున్నారు.

ఇక నెటిజన్లు అయితే వారి అభిప్రాయాన్ని కామెంట్స్ చేయడం ద్వారా తెలియజేస్తున్నారు.ఈ సంవత్సరం నేను చూసిన అత్యుత్తమ వీడియో ఇదే….అని ఒకరంటే అద్భుతం! ఇలాంటి అనుభవాలు నాకు కూడా వున్నాయి… మా అబ్బాయి కూడా అచ్చం అలాగే… అంటూ మరో యూజర్ కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube