బుక్ మై షో యాప్ లో భీమ్లా నాయక్ టికెట్లను బుక్ చేసుకోలేరట.. ఏం జరిగిందంటే?

ప్రస్తుత కాలంలో చాలామంది సినిమా టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి బుక్ మై షో యాప్ తో పాటు మరికొన్ని యాప్స్ పై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.థియేటర్లలో నచ్చిన సీట్లను ఎంపిక చేసుకునే అవకాశంతో పాటు కౌంటర్ ముందు నిలబడే అవసరం లేకపోవడంతో ఎక్కువమంది బుక్ మై షో యాప్, ఇతర యాప్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

 Book My Show Issue For Bheemla Naik Movie Details Here , Bheemla Nayak, Pawan Ka-TeluguStop.com

అయితే భీమ్లా నాయక్ సినిమాకు మాత్రం నైజాంలో బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు.

ఇతర యాప్స్ తో పోల్చి చూస్తే బుక్ మై షో యాప్ కు పాపులారిటీ ఎక్కువనే సంగతి తెలిసిందే.

క‌న్వేయెన్స్ ఫీ పేరుతో బుక్ మై షో ఎక్కువ మొత్తం ఛార్జీలను వసూలు చేస్తుండటంతో సినిమాలను చూసే ప్రేక్షకులకు భారం పెరుగుతోంది.తెలంగాణలో కొన్నిరోజుల క్రితం టికెట్ల ధరలు పెరిగాయి.

ఆ టికెట్ రేట్లకు ఈ ఛార్జీలు కలిపితే భారం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

డిస్ట్రిబ్యూటర్లు కోరినా బుక్ మై షో నిర్వాహకులు ఛార్జీలను తగ్గించకపోవడంతో భీమ్లా నాయక్ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నైజాం విషయంలో బుక్ మై షోకు భీమ్లా నాయక్ ను ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.

ప్రేక్షకులు థియేటర్ల ద్వారా మాత్రమే టికెట్ రేట్లను బుక్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.అయితే కొన్నిచోట్ల భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.

భీమ్లా నాయక్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్ టికెట్ మార్కెట్ పెరగవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.త్వరలో బుక్ మై షోకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం అవుతుందేమో చూడాలి.

ఏపీలో మాత్రం బుక్ మై షోకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube