చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన కొంతకాలం పాటు రాజకీయ పనులలో భాగంగా సినిమాలకు దూరమయ్యారు.

 Bollywood Actor Kunal Kapoor Play Villan Role On Vishwambara Movie Details, Kuna-TeluguStop.com

కానీ తనకు రాజకీయాలు ఏమాత్రం సెట్ అవ్వని భావించి తిరిగి సినిమాలలోకి వచ్చారు.ఇలా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి వరస సినిమాలలో నటిస్తున్న చిరంజీవి త్వరలోనే విశ్వంభర( Vishwambhara )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి.

Telugu Bollywoodkunal, Chiranjeevi, Kunal Kapoor, Kunalkapoor, Vasista, Vishwamb

ఈయన సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మినహా మిగిలిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.కానీ విశ్వంభర సినిమా ద్వారా ఈయన సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు.ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

డైరెక్టర్ వశిష్ట( Vasista ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతోంది.

Telugu Bollywoodkunal, Chiranjeevi, Kunal Kapoor, Kunalkapoor, Vasista, Vishwamb

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష( Trisha ) నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో స్టాలిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా తర్వాత తిరిగి విశ్వంభర సినిమాలో వీరిద్దరి జోడిగా సందడి చేయనున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సరికొత్త అప్డేట్ విడుదల చేశారు.ఈ సినిమాలో చిరంజీవితో పోటీ పడటం కోసం విలన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.

విశ్వంభర సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్( Kunal Kapoor ) నటించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించి ఆయనకు విశ్వంభర సెట్ కి స్వాగతం పలికారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube