సంగ్రామ యాత్ర‌పై బీజేపీ నేత‌ల చ‌ర్చ‌లు.. వ‌చ్చే లాభం ఏంటి..?

బీజేపీ నేత‌లు ఇప్పుడు రాష్ట్రంలో ఎలాగైనా బ‌ల‌ప‌డేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి హోదాలో బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర‌ను మొద‌లు పెట్టారు.

 Bjp Leaders' Discussions On The Campaign What Is The Benefit , Bjp, Sanjay , S-TeluguStop.com

అయితే ఆయ‌న యాత్ర‌పై ఇప్పుడు ప్ర‌తిప‌క్షాల‌తో పాటు సొంత పార్టీలో కూడా తీవ్రంగా చ‌ర్చ సాగుతోంది.ఆయ‌న చేస్తున్న యాత్ర వ‌ల్ల అస్స‌లు ఏం లాభ‌మ‌ని అంతా భావిస్తున్నారు.

ఎందుకంటే ఎన్నిక‌లు కూడా ఇప్ప‌ట్లో లేవు.ఆయ‌న చేస్తున్న యాత్ర వ‌ల్ల పార్టీకి ఏ స్థాయిలో లాభం ఉంటుంది.

అస‌లు ఏ జిల్లాలో త‌మ‌కు ఉన్న బ‌ల‌మెంత అని లెక్క‌లు వేసుకుంటున్నారు.

అయితే ఈ యాత్ర వ‌ల్ల మెయిన్‌గా ద‌ళితులు, గిరిజ‌నుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని కూడా చెప్తున్నారు.

మ‌రి వారిని ఆక‌ట్టుకోవాలంటే అర్బ‌న్ ఏరియాల్లో యాత్ర‌లు చేస్తూ పోతే ఎలా అని కూడా చ‌ర్చించుకుంటున్నారు.ఎందుకంటే ఇప్ప‌టికే చాలాచోట్ల ద‌ళితుల‌కు జ‌రిగిన దారుణాల‌పై బీజేపీ పెద్ద‌గా స్పందించింది కూడా లేదు.

మొన్న‌టికి మొన్న పోడు భూముల‌ను ఫారెస్టు ఆఫీస‌ర్లు లాక్కుంంటే అక్క‌డ బీజేపీ అనే మాట‌లు వినిపించ‌లేదు.ఇక బీజేపీకి మైనార్టీ వ‌ర్గం పెద్ద‌గా క‌లిసి రావ‌ట్లేదు.ఇక మెజార్టీ వ‌ర్గాల‌పై దృష్టి పెడుత‌న్నా కూడా వారు ఏ మేర‌కు ఆద‌రిస్తారో తెలియ‌దు.

Telugu Bandi Sanjay, Kishan Redy, Sangrama Yatra, Sanjay, Telengana Bjp, Tribals

ఎందుకంటే అర్భ‌న్ ఏరియాల్లో మెజార్టీ వ‌ర్గాల్లో బీజేపీకి అంత ప‌ట్టే ఉంటే మొన్న జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో బీజ‌పీ అధికారంలోకి వ‌చ్చి ఉండేది క‌దా.కానీ అలా జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి అన్ని వ‌ర్గాల్లో బీజేపీకి ప‌ట్టు లేద‌ని తెలుస్తోంది.ఇంకో విష‌యం ఏంటంటే రాష్ట్రంలో కొన్ని జ‌ల్లాల్లో మాత్ర‌మే బీజేపీకి కేడ‌ర్ ఉంది కానీ అన్ని జిల్లాల్లో లేక‌పోవ‌డంతో ఆ జిల్లాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట‌ట్కుండా ఇలా ప‌ట్టు ఉన్న జిల్లాల్లోనే యాత్ర‌లు చేస్తూ పోతే ఎలా అని కూడా ప్ర‌శ్నించుకుంటున్నారంట‌.

మ‌రి సంజ‌య్ యాత్ర వ‌ల్ల బీజేపీకి ఏ మేర‌కు స‌క్సెస్ వ‌స్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube