తెలంగాణ సీఎం కేసీఆర్ గారాల కుమార్తే కవిత ఢిల్లి లిక్కర్ స్కాంలో త్వరలోనే జైలు పాలు అవ్వక తప్పదని బిజేపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు..
శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో రాజగోపాల్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు కోసం తిరుమలకు రావడం జరిగిందని, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
స్వామి వారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అన్నదమ్ములుగా కలిసి ఉండి తెలుగు వారి గొప్పదనం దేశంకు చాటి చెప్పేలా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్ధించినట్లు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టిపై తెలంగాణ ప్రజల వ్యతిరేకత ఉందనేది మునుగోడు ఎన్నికల్లోనే కేసిఆర్ కి తెలిసిందన్నారు.
వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కౌరవ సైన్యం వచ్చి ప్రతి గ్రామానికి ఒక మంత్రి, అధికారి వచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిన విషయం కేసీఆర్ కు పూర్తి అర్ధం అయ్యిందని, ప్రజల ఆలోచనలను డైవర్షన్ చేసేందుకు, టిఆర్ఎస్ పార్టీపై వెళ్తే ప్రజలు ఓటు చేసే పరిస్ధితి లేదని, బిఆర్ఎస్ పార్టి అనే కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీయడం జరిగిందని ఆయన విమర్శించారు.నలుగురు ఎమ్మెల్యేలను బిజేపి కొనాలని చూస్తున్నట్లు కేసీఆర్ నాటకం ఆడి ప్రజల ఆలోచనలను డైవర్షన్ చేసారో అందరికి తెలుసునని తెలిపారు.
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని,ఒక కుటుంబ పాలన, నియంత పాలన కొనసాగుతుందన్నారు.అటువంటి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ప్రజలకు, పార్టిలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు.
అందులో భాగంగానే తాను కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేసి బిజేపి నాయకత్వంలోనే తెలంగాణలో ప్రజాస్వామ్యంను కాపాడవచ్చని నిర్ణయం తీసుకుని కేసిఆర్ కి వ్యతిరేకంగా యుద్దం చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణలో నే కాకుండా యావత్తూ తెలుగు ప్రజలంతా నైతికంగా రాజగోపాల్ రెడ్డి, బిజేపి గెలిసిందన్ని సంతోష పడ్డారని చెప్పారు.
పది వేల ఓట్లతో కేసీఆర్ గెలిసినా సంతోషం లేదన్నారు.రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం రక్షణ కోసం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం బీజేపి మోదీ, అమిత్ షా నాయకత్వంలో నూటికి నూరు శాతం తెలంగాణలో బిజేపి విజయం సాధించి, ప్రభుత్వంను నడిపిస్తుందన్నారు.
తెలంగాణలో కోసం ప్రాణాలు అర్పించిన నిజమైన అమరవీరులకు నిజమైన నివాళి అందించాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నారు.నా యాభై ఐదు ఏళ్ళ జీవితంలో డబ్బు కోసం నేను వెళ్ళలేదని, రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేసారని ఆరోపించారు.