ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో తన దూకుడు తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన జనసేన అదినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తన తన వారాహి యాత్రలతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఒకదాని తర్వాత ఒకటి సీరియస్ ఇష్యూస్ ని టేకప్ చేస్తూ అధికార పక్షానికి నిద్ర లేకుండా చేస్తున్నారనే చెప్పాలి.పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆంధ్రా మంత్రులందరూ ప్రెస్ మీట్ లు పెట్టి ఖండిస్తున్నా కూడా డోసు సరిపోవట్లేదని ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండ గడుతున్న పవన్ వ్యాఖ్యలకే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ మైలేజ్ దక్కుతుందని సమాచారం.
అయితే పెరుగుతున్న పవన్ గ్రాఫ్ ను ఉపయోగించుకునే విషయంలో మాత్రం కేంద్ర బిజెపి( BJP ) ఇంకా నాన్చివేత ధోరణి అవలంబిస్తుందని వార్తలు వస్తున్నాయి .ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ గ్రాఫ్ బాగా పెరుగుతుందని వరుస వార్తా కథనాలు ప్రసారమవుతున్నా కూడా తమకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న జగన్ పట్ల సమాన ప్రాధాన్యతనే భాజపా అధిష్టానం ఇస్తూ వస్తుంది కేంద్రం లో ప్రతిపక్షాలన్నీ కూటమికట్టి తమకు వ్యతిరేకంగా నిలబడి తమను ఓడించాలని చూస్తున్నా కూడా జగన్ ఇస్తున్న షరతులు లేని మద్దతుతో గట్టెక్కుతున్న భాజపా జగన్ను ఇప్పట్లో వదులుకునే ఉద్దేశంలో లేనట్లుగా కనిపిస్తుంది.
అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్ ( YS Jagan Mohan Redd )గ్రాఫ్ తగ్గుతుందని, ప్రతిపక్షాలు గ్రాఫ్ పెరుగుతుంది అన్న సర్వే రిపోర్టర్లు వస్తున్నా కూడా చివరి నిమిషం వరకు జగన్ తో స్నేహాన్ని వదులుకోకూడదని నిర్ణయంలోనే భాజపా ఉన్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి .దానిని గమనిస్తున్న పవన్ కూడా ఆంధ్ర రాష్ట్ర భాజపా నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వకుండా దూరం మైంటైన్ చేస్తున్నారు ఒకసారి కేంద్రం నుంచి బవిష్యత్తు కార్యాచరణ పై పూర్తిస్థాయి స్పష్టత వచ్చిన తరువాతే ఉమ్మడి కార్యాచరణ గురించి ఆలోచించాలని భావిస్తున్న జనసేనాని తన కార్యక్రమాలన్నీ విడిగానే చేసుకుంటూవెళుతున్నారు .తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ పై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలనుకుంటున్న భాజాపా అప్పటి పరిస్థితులను సర్వే రిపోర్ట్ లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత జనసేనతో పొత్తుకు సంబంధించి పూర్తిస్థాయి నిర్ణయాలు జరుగుతాయని, అప్పటివరకు వేచి చూచే ధోరణి అవలంబించాలని భాజపా అధిష్టానం చూస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.