మహిళా బిల్లుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.హైదరాబాద్ లో మహిళా ఘోష – బీజేపీ భరోసా దీక్షను ప్రారంభించిన ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగాయని బండి సంజయ్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ దాడులపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
మహిళలపై సైబర్ నేరాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్ ఉందని విమర్శించారు.బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఎందుకు దీక్ష చేస్తుందో చెప్పాలన్నారు.
మహిళా సర్పంచ్ కు ఎమ్మెల్యే నుంచి రక్షణ లేదని ఆరోపించారు.జాగృతి సంస్థలోనే మహిళలు లేరన్న బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మహిళలు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు.
కేసీఆర్ కనీసం మూడు శాతం కూడా మహిళా రిజర్వేషన్ పాటించలేదని విమర్శలు గుప్పించారు.