కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని చాలా రకాల వైరస్లు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.ఈ వైరస్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
మరి కొంతమంది ప్రజలు ఈ వైరస్ ల వల్ల ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలని కాకుండా జంతువులను పక్షులను కూడా కొన్ని రకాల వైరస్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ ఇచ్చినా నివేదిక ప్రకారం ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేనటువంటి బర్డ్ ఫ్లూ వ్యాప్తిని ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.అక్టోబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు దాదాపు ఏడు దేశాలలో 2520 సార్లు ఏవిఎన్ ఇన్ఫ్లో ఎంజా వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపారు.
ప్రభావిత ప్రాంతంలో దాదాపు 5 కోట్లకు పైగా పక్షులను చంపినట్లు చెబుతున్నారు.ముందస్తుగా వధించిన కోళ్లు, బాతులు ఇందులో చేర్చలేదని ఈ ఎఫ్ ఎస్ ఏ వెల్లడించింది.
బర్డ్ ఫ్లూను కంట్రోల్ చేసేందుకు వ్యాక్సినేషన్ చేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
2022 వేసవిలో అడవి పక్షులు పౌల్ట్రీ లలో బర్డ్ ఫ్లూను మొదటిసారిగా అక్టోబర్ నెల మొదలైనప్పుడు ఆఖరి సారిగా గుర్తించినట్లు ఈ ఎఫ్ ఎస్ ఏ వెల్లడించింది.కలుషితమైన పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మనుషులకు సంక్రమించినట్లు వెల్లడించింది.అంతే కాకుండా ఈ వ్యాధి పక్షుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సంక్రమించే అవకాశం చాలా తక్కువగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది.
ఈ వైరస్ పౌల్ట్రీ ఫార్మ్ లలోకి వ్యాపించడానికి కారణం నీటి పక్షులు కావచ్చని ఈ సంస్థ అభిప్రాయపడింది.పౌల్ట్రీ సంస్థలపై వ్యాప్తి రాబోయే రోజుల్లో మరి కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా తెలిపింది.
అందుకోసం పౌల్ట్రీ నీ మెయింటెనెన్స్ చేస్తున్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతున్నారు.ఎందుకంటే ఈ వ్యాధి ఎంతో భయంకరమైనది అని కూడా చెబుతున్నారు.