Pallavi Prashanth : ఆ క్షణం చచ్చిపోవాలనిపించింది.. మొదటిసారి అరెస్ట్ పై స్పందించిన ప్రశాంత్?

బిగ్ బాస్ ( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కామన్ మ్యాన్ క్యాటగిరి నుంచి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi prashanth ) హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఇలా కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చి చివరికి టైటిల్ గెలుచుకున్నారు.

 Bigg Boss Winner Pallavi Prashanth First Time React Over His Arrest-TeluguStop.com

అయితే ఈయన విన్నర్ అయిన తర్వాత గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున ఊరేగింపుగా రావడమే కాకుండా మరో కంటెస్టెంట్ అమర్ ( Amar ) కారుపై అభిమానులు రాళ్ళ దాడి చేయడంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి కేసు నమోదు చేసి తనని జైలుకు పంపించారు.

ఇలా బిగ్ బాస్ విన్నర్ అయ్యాననే ఆనందం కొన్ని రోజులైనా లేకుండా ప్రశాంత్ ను అరెస్టు చేసి రెండు రోజుల పాటు జైలులో ఉంచారు.అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు.ఇలా బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ప్రశాంత్ ఎప్పుడు కూడా తన అరెస్టు గురించి స్పందించలేదు.

కానీ తాజాగా బిగ్ బాస్ ఉత్సవ్ ( Bigg Boss Ustav ) కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కప్పు గెలుచుకొని మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నాను కానీ ఆయన కోర్టు బయట పడుకోని ఉన్న వీడియో చూసి గుండె బద్దలైందని తెలిపారు.ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ తన తండ్రిని తలుచుకొని కన్నీటి పర్యంతరం అయ్యారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube