బిగ్ బాస్ స్టేజ్ పై షకీలా సంచలన వ్యాఖ్యలు.. దుస్తులు విప్పేయమన్నా నాన్న పట్టించుకోలేదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి బోల్డ్ బ్యూటీ షకీలా( Shakeela ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు వరుసగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

 Bigg Boss Telugu 7 Shakeela Entered 6th Contestant, Bigg Boss 7,shakeela,shakeel-TeluguStop.com

స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించింది షకీలా.ఆ తర్వాత కాలంలో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

అయితే ఈమె వెండితెరపై ఎక్కువ శాతం బోల్డ్ పాత్రల్లో( Bold Roles ) నటించింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే చాలామంది సినిమాలలో బోల్డ్ గా నటించడంతో నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుందని పొరపడ్డారు అని చెప్పవచ్చు.

రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది.

Telugu Bigg Boss, Nagarjuna, Shakeela, Silk Smitha-Latest News - Telugu

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది.కాగా షకీలా తల్లిది నెల్లూరు, తండ్రిది చెన్నై.ఇకపోతే తాజాగా తెలుగులో బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇక బిగ్ బాస్ హౌస్ లోకి తాజాగా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది షకీలా.ఈ సందర్భంగా స్టేజ్ పై ఆమె నాగార్జునతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.స్టేజ్ పై షకీలా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.10వ తరగతి ఫెయిల్‌ కావడంతో మా నాన్న నన్ను చితకబాదాడు.ఆయన మేకప్‌మెన్‌ నన్ను సినిమాల్లో చేర్పిస్తానని అన్నాడు.అలా ఒకరోజు నేను సిల్క్‌ స్మితను( Silk Smitha ) చూశాను.నన్ను సిల్క్‌ స్మిత చెల్లెలిగా సెలక్ట్‌ చేశారు.

Telugu Bigg Boss, Nagarjuna, Shakeela, Silk Smitha-Latest News - Telugu

అప్పుడు చాలా సినిమాల్లో నన్ను దుస్తులు విప్పేయమంటున్నారు నాన్న అని చెప్తే, చేయనని చెప్పేయ్‌ అని సులువుగా అనేవారు.నాన్న చనిపోయాక హాట్‌ రోల్స్‌ చేశాను.నా డబ్బులన్నీ మా అక్క చూసుకునేది.

తను బాగుపడింది.నా సినిమాకు సెన్సార్‌ ఇవ్వకుండా ఆపేశారు.

సినిమా అవకాశాలు లేక నాలుగేళ్లు ఖాళీగా ఉన్నాను.నేను నేనుగా ఉండటమే నా బలం అని చెప్పుకొచ్చింది.

కాగా ఈమె రియల్ లైఫ్( Shakeela Real Life ) లో ఎన్నో రకాల సామాజిక సేవలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా షకీల 50 మందికి పైగా ట్రాన్స్‌జెండర్ల బాగోగులు చూసుకుంటోంది.

వారిలో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు స్టేజీపైకి వచ్చి షకీల గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube