బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన ప్రతి నటుడికి దక్కిన గుర్తింపు వెనుక ఎంతో కష్టం ఉంటుంది.కొంతమంది కెరీర్ తొలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడితే మరి కొందరు ఆ విషయాలను వెల్లడించడానికి అస్సలు ఇష్టపడరు.
ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన బీ.హెచ్.ఈ.ఎల్ ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
శర్వానంద్ తో శతమానం భవతి, శ్రీకారం సినిమాలు చేశానని శర్వానంద్ తో శ్రీకారం షూట్ సమయంలో శతమానం భవతిలో చేశానని చెబితే ఎక్కడ చేశారని ఆయన అడిగారని పూజారి పాత్ర చేశానని నేను చెప్పానని ప్రసాద్ చెప్పుకొచ్చారు.శర్వానంద్ బాగా చేశారు అని చెప్పారని ఆయన తెలిపారు.
శ్రీకారం హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ అరుంధతి చేశారు కదా అని అడగటంతో తాను ఆశ్చర్యపోయానని ఆయన చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్ ఇంటికి వెళితే లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే ఆపేశారని ఆయన పేర్కొన్నారు.

పూరీ జగన్నాథ్ కు నేను తెలుసని కానీ గేటు దాటి లోపలికి వెళితే కదా ఆయనను కలవడం సాధ్యమవుతుందని ప్రసాద్ అన్నారు.నాకేంటీ బాధ అని ఆ సమయంలో అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు.నేను కంఫర్ట్ జోన్ లోనే ఉంటూ వచ్చానని ఆయన తెలిపారు.తిరుపతికి వెళితే ఎక్కువ సమయం దేవుడిని చూసే అవకాశం చక్రవాకం వల్ల దక్కిందని ఆయన చెప్పుకొచ్చారు.

చక్రవాకం వల్ల నాకు మంచి గుర్తింపు దక్కిందని ఆయన పేర్కొన్నారు.పూరీ జగన్నాథ్ తర్వాత నన్ను చూసి లోపలికి వెళ్లు అని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఆ తర్వాత సెక్యూరిటీ నాకు క్షమాపణ చెప్పారని ప్రసాద్ అన్నారు.అవన్నీ తట్టుకుని దాటుకుని రావాలని ప్రసాద్ కామెంట్లు చేశారు.ప్రసాద్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.