పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ గా ఈ సినిమా వస్తుంది.
సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు, డైలాగ్ టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక లేటెస్ట్ గా సినిమా నుండి భీమ్లా నాయక్ సాంగ్ వీడియో ప్రోమో రాబోతుందని తెలుస్తుంది.
లాలా భీమ్లా.
సాంగ్ వీడియో ప్రోమో దీపావళి కానుకగా ఈరోజు 7:02 గంటలకు రిలీజ్ ప్లాన్ చేశారు.ఆల్రెడీ సాంగ్ తో సూపర్ అనిపించిన ఈ సాంగ్ వీడియో ప్రోమో అదిరిపోయేలా ఉంటుందని చెప్పొచ్చు.
ఇక ఈ వీడియో సాంగ్ ప్రోమో కోసం రిలీజ్ చేసిన పోస్టర్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.పిక్కలు కనిపించేలా లుంగీ పైకెత్తి కట్టుకుని కూర్చున్న పవన్ ముందు మందు సీసా కూడా కనిపిస్తుంది.
చూస్తుంటే భీమ్లా నాయక్ పాత్ర పవర్ స్టార్ మాస్ ఫ్యాన్స్ కు బీభత్సంగా ఎక్కేలా ఉందని అనిపిస్తుంది.ఇక లేటేస్ట్ పోస్టర్ లో కూడా సినిమా రిలీజ్ డేట్ జనవరి 12 అని పెట్టడం విశేషం.