ఏ తండ్రికి అయినా సరే తన పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే అత్యంత ఆనందంగా ఉంటుంది కదా.ఈ విషయంలో ఎవరైనా ఒక్కటే.
నిజానికి తండ్రి అంటే పిల్లలకు పెద్ద స్ఫూర్తి.ఆయన్ను చూసే వారిలా కావాలనే కోరిక పుడుతుంది.
అలాంటి వారెందరో తమ పిల్లలను సన్మార్గంలో నడిపించి తాము పనిచేస్తున్న శాఖల్లో తమ కంటే పెద్ద స్థాయిలో తమ పిల్లల్ని చూసిన తండ్రులు ఎంతో మంది ఉన్నారు.ఇక పోలీస్ శాఖలో ఇలాంటి ఘటనలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
తండ్రి కానిస్టేబుల్ అయితే కొడుకు ఐపీఎస్ కావడం కూడా మనం చూశాం.
ఇప్పుడు కూడా యూపీకి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ అయిన ఆపేక్షా నింబాడియా కూడా ఇదే కోవలోకి వస్తున్నారు.
ఆమె కూడా తన తండ్రినే ఇన్ స్పిరేషనల్ గా తీసుకుని ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది.పోలీస్ శాఖలోనే పెద్ద అధికారిగా మారిపోయింది.మరి ఇంత పెద్ద స్థాయికి చేరిన కూతురును చూస్తే ఎవరికైనా సంతోషమే కదా.కాగా వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రత్యేకమైన సందర్భంలో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తండ్రి తన పై ఆఫీసర్ కావడంతో కూతురు వెంటనే సెల్యూట్ చేసింది.మరి తండ్రి ఊరుకుంటారా అసలే తన గారాల కూతురు కావడంతో ఆయన కూడా వెంటనే సెల్యూట్ చేశారు.

యూపీలో ఐటీబీపీలో ప్రస్తుతం డీఐజీగా పనిచేస్తున్న నింబాడియా తన కూతురును కూడా పోలీస్ ఆఫీసర్ గా చూడాలని అనుకున్నారు.దీంతో తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన కూతురు పట్టుదలతో చదువుకుని అంబేడ్కర్ పోలీస్ అకాడమీ నుంచి పట్ట భద్రురాలు అయింది.కాగా రీసెంట్ గా డిప్యూటీ సూపరింటెండెంట్‌గా కూడా బాధ్యతలు తీసుకుంది.ఇక మొన్న గ్రాడ్యుయేషన్ పరేడ్ సందర్భంగా తండ్రీ కూతురు ఇద్దరూ ఈ కార్యక్రమానికి వచ్చారు.విధుల్లో భాగంగా తండ్రిని చూసిన ఆపేక్ష వెంటనే సెల్యూట్ చేయగా అతను కూడా సెల్యూట్ చేయడం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.