నారా బ్రాహ్మణి( Nara Brahmani ) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ కావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.వ్యాపారవేత్తగా నారా బ్రాహ్మణి ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించారు.
నారా బ్రాహ్మణి స్పీచ్ లకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.చాలా సందర్భాల్లో చంద్రబాబు ( Chandrababu ) సైతం బ్రాహ్మణి గురించి గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే.
బాలయ్య చిన్నల్లుడు భరత్( Bharath ) ఒక ఇంటర్వ్యూలో నారా బ్రాహ్మణి, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.నేను ఫుల్ టైమ్ పొలిటీషియన్ కాదని ఆయన అన్నారు.
రాజకీయమే నా జీవితం అని ఎప్పుడూ అనుకోలేదని భరత్ తెలిపారు.గత ఆరు నెలల్లో టీడీపీ పరిస్థితి మారిందని ప్రజలు స్వచ్చందంగా వస్తున్నారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్( Jr Ntr ) వస్తే కలిసి పని చేద్దామని లోకేశ్ సైతం చెబుతున్నారని భరత్ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్ ను కలుస్తుంటానని ఆయన తెలిపారు.నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని భరత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.అలేఖ్యారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో లేదో చెప్పలేనని భరత్ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
2024లో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో నేను ఉంటానని ఆయన తెలిపారు.ఎమ్మెల్యేగా వెళ్లాల్సిన ఆలోచన అయితే లేదని భరత్ చెప్పుకొచ్చారు.గీతం యూనివర్సిటీ బాధ్యతలు కూడా నాపై ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.భరత్ 2024 ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.నారా బ్రాహ్మణి కూడా రాజకీయాల గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.నారా బ్రాహ్మణికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.