నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి( Bhagavanth Kesari )”.అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్స్ తర్వాత బాలయ్య ఈ సినిమాతో రావడంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి.
అందులోను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో పక్కా హిట్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారు.మరి ఈ సినిమా నిన్న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా రిలీజ్ చేసారు.
దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయగా ఈ సినిమాకు అన్ని వర్గాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగా రాగా ఈ సినిమా ఈ రోజు మరింత పుంజుకుంది.
బాలయ్య ( Balakrishna )కెరీర్ లోనే మరో బ్లాక్ బస్టర్ దిశగా ఈ సినిమా దూసుకు పోతుంది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా మంచి టాక్ రావడంతో మొదటి రోజు అదిరిపోయే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది.ముఖ్యంగా యూఎస్ లో ప్రీమియర్స్ నుండే అదిరిపోయే టాక్ రావడంతో డే 1 సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టిందట.ఇది బాలయ్య కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
మొదటి రోజు 6 లక్షల మార్క్ ను క్రాస్ చేసి 1 మిలియన్ దిశగా దూసుకు పోతుంది.చూస్తుంటే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ దిశగా సాగుతుంది.కాగా ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.