ఓవర్సీస్ లో దుమ్ములేపేసిన 'భగవంత్ కేసరి'..ఇదేమి క్రేజ్ అయ్యా బాబు!

ప్రస్తుతం సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )ఎంజాయ్ చేస్తున్న పీక్ స్టార్ స్టేటస్ ఏ హీరో కూడా ఎంజాయ్ చెయ్యడం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.వరుస ఫ్లాప్స్ తో కెరీర్ ముగుస్తున్న సమయం లో ఆయనకి అఖండ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

 Bhagavanth Kesari Overseas Collection Details, Bhagavanth Kesari , Nandamuri B-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ‘వీర సింహా రెడ్డి‘ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది.ఇలా వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య అనిల్ రావిపూడి తో కలిసి చేసిన చిత్రం ‘భగవంత్ కేసరి( Bhagavanth Kesari )’.

విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.రొటీన్ బాలయ్య మార్క్ మాస్ మసాలా కాకుండా, ఈసారి సెంటిమెంట్ పాళ్ళు ఎక్కువ ఉన్న సబ్జెక్టు తో మన ముందుకు వచ్చాడు బాలయ్య.

Telugu America, Anil Ravipudi, Kajal Aggarwal, Sreeleela-Movie

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘లియో‘ మేనియా బలంగా నడవడం వల్ల భగవంత్ కేసరి చిత్రానికి మార్నింగ్ షోస్ కాస్త స్లో అయ్యాయి.ఆ తర్వాత ఫస్ట్ షోస్ నుండి దాదాపుగా అన్నీ ప్రాంతాలలో ఈ చిత్రం పికప్ అయ్యింది.అలా బంపర్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొదటి రోజు 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు.సోషల్ మీడియా లో ఉండే అన్నీ వెబ్ సైట్స్ నుండి మంచి రేటింగ్స్ రావడం తో ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం దంచికొట్టేసింది.నార్త్ అమెరికా లో కేవలం ప్రీమియర్ షోస్ నుండే ఈ సినిమా 5 లక్షల డాలర్లు రాబట్టేసింది.‘వీర సింహా రెడ్డి’ చిత్రం తర్వాత రెండవ సారి బాలయ్య బాబు 5 లక్షల ప్రీమియర్స్ ని రాబట్టిన సీనియర్ హీరో గా నిలిచాడు.

Telugu America, Anil Ravipudi, Kajal Aggarwal, Sreeleela-Movie

అలా మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రం నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.కేవలం అమెరికా లో( America ) మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాలలో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 7 లక్షల డాలర్ల వసూళ్లు కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండి వచ్చాయి.‘వీర సింహా రెడ్డి‘ చిత్రం తర్వాత ఇది బాలయ్య కెరీర్ లో ది బెస్ట్ అనుకోవచ్చు.ఓవర్సీస్ లో అయితే ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.కానీ వరల్డ్ వైడ్ గా అన్నీ ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీకెండ్ వసూళ్ల బట్టి తెలుస్తుంది.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 65 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube