కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ ఘని కుమారుడు రషీద్ తయారు చేసిన జిల్లా పోలీసు శాఖ పోర్టల్ ను డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించిన డిజిపి మహేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డా.
వినీత్.జి ఐపిఎస్.https://www.bhadradrikothagudempolice.in లింకు ద్వారా ఇకపై సులభంగా జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్న పోలీసుల సేవలు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ గారి ఆదేశాలతో జిల్లా పోలీసుల సేవలు ప్రజలకు సులభంగా అందించే ఆలోచనతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన కొత్తగూడెం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఘని గారి కుమారుడు రషీద్ సహకారంతో జిల్లా పోలీసు పోర్టల్ ను రూపొందించిడం జరిగింది.https://www.bhadradrikothagudempolice.in లింకు ద్వారా జిల్లా పోలీస్ శాఖ పూర్తి సమాచారంతో ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది.ఈ వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు అంతర్జాలం ద్వారా కూడా పోలీసుల సహాయం పొందవచ్చని ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ తెలిపారు.
ఈ పోర్టల్ ద్వారా జిల్లా పోలీసు అధికారుల వివరాలతో కూడిన సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
అంతేకాకుండా ఈ పోర్టల్ ద్వారా కూడా జిల్లా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలియజేసారు.అదేవిధంగా జిల్లాలో నిత్యం పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో తప్పిపోయిన వారి వివరాలను, గుర్తుతెలియని మృతదేహాల వివరాలను,నిషేధిత మావోయిస్ట్ ల వివరాలు,పోలీస్ రిక్రూట్మెంట్ వివరాలు మరియు జిల్లా పోలీసుల నుండి కావాల్సిన no objection certificates కొరకు మరియు ఇతరత్రా సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చని తెలియజేసారు.
వీటితో పాటు పాస్పోర్ట్ సేవలను మరియు జిల్లా పోలీసుల సోషల్ మీడియా ఖాతాలను కూడా ఈ పోర్టల్ కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు.జిల్లా పోలీసుల పనితీరును సూచిస్తూ ఈ పోర్టల్ని రూపొందించిన రషీద్ ను మరియు అతని తండ్రి హెడ్ కానిస్టేబుల్ ఘని లను ఈ రోజు డీజీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
జిల్లా ఐటి సెల్ అధికారులను,సిబ్బందిని కూడా ప్రశంసించారు.