భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన నేత తెల్లం వెంకట్రావు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనంతరం అక్కడ అన్యాయం జరుగుతుందంటూ బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెల్లం వెంకట్రావు గులాబీ కండువా కప్పుకున్నారు.
కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు నియోజకవర్గ నేతలు కారెక్కారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఈ విషయం తెల్లం వెంకట్రావుకు త్వరగానే తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు.