సోషల్ మీడియా( Social Media ) ఇపుడు సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావడంతో విశ్వవ్యాప్తంగా ఏమేం జరుగుతుందో తేలికగా తెలుసుకుంటున్నారు.ఒకప్పుడు జంతువులు కేవలం అడవుల్లో మాత్రమే ఉండేవి.
కానీ ఇటీవల కాలంలో మనుషులు పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయి అడవులను కూడా నరికివేసి కబ్జా చేయడంతో జంతువులు వేరేదారిలేక జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.ఈ క్రమంలో జనావాసాల్లోకి జంతువులు తరచూ వస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.
దాంతో ప్రజలు భయాందోళనకు గురి కావడం అనేది జరుగుతుంది.ఇప్పటివరకు చిరుతపులులు సింహాలు లాంటి జంతువులు అటు జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి.తాజాగా ఎలుగుబంట్లు ( Bears ) కూడా మేము ఏమాత్రం తక్కువ కామంటూ జనావాసాల్లోకి రావడం మనం చూస్తూ వున్నాం.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈసారి అమెరికాలో ( America ) ఇంటి బయట పార్క్ చేసి ఉన్న కారు దగ్గరికి ఒక ఎలుగుబంటి వచ్చింది.అది అడవిలోకి వెళ్ళిపోతుందని ఆ కారు యజమానులు మొదట అనుకున్నారు.
దాంతో అది ఏం చేస్తుందో అని ఫోన్లో వీడియో తీయడం మొదలుపెట్టారు.
కట్ చేస్తే ఎంతో తెలివిగా ఆలోచించిన ఎలుగుబంటి ఏకంగా కార్ డోర్ ఓపెన్ చేసింది.ఆ తర్వాత ఆ కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించింది.అయితే ఎలుగుబంటి కార్ డోర్ తీయగానే భయపడి పోయిన యజమానులు.
గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు.దాంతో వారి కేకలు విన్న ఎలుగుబంటి భయపడిపోయి దగ్గరలో వున్న పొదల్లోకి పారిపోయింది.
ఎలుగుబంటి కార్ డోర్ తీయగానే ఇక ఆ ఇంటి యజమానులు ఎంతలా భయపడిపోయారో అన్న విషయం వీడియోలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది.