కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు.గెలుపు, ఓటములు సహాజమన్న ఆయన ఎన్నికల్లో పరాజయంపై సమీక్షిస్తామని పేర్కొన్నారు.
రెండు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి వరకు కొనసాగిందన్నారు.ఎన్నికల ఫలితాలపై పార్టీ శ్రేణులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త సర్కార్ కు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు.







