రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇలా చూస్తున్నారా.. అయితే ప్రాణాలకే ప్రమాదం..

రోడ్లు దాటేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.అయితే కొందరు రోడ్డు దాటేటప్పుడు( Road Crossing ) రెండు వైపులా చూస్తారు.

 Be Careful With Your Looks While Crossing The Road Video Viral Details, Viral Vi-TeluguStop.com

తర్వాత దాటడం స్టార్ట్ చేస్తారు.కానీ ఏదైనా వాహనం వచ్చి ఢీకొడుతుందో అని ఒక వైపే చూస్తూ మధ్యలో ఆగిపోతారు.

లేదంటే వెనకకి ఉరుకుతారు.స్టడీగా ఒక డైరెక్షన్‌లో వెళ్ళిపోతూ ఉంటే ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఒక క్లారిటీ ఉంటుంది.

దానికి అనుగుణంగా వారు బ్రేక్ వేయడమో లేదా పక్కన నుంచి వెళ్ళిపోవడమో చేస్తారు.కానీ కొందరు టెన్షన్ పడుతూ రోడ్డు మధ్యలో ఆగిపోతారు.

చివరికి రహదారులు వీరిని ఢీకొడుతుంటారు.అప్పుడు చాలా గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది.

తాజాగా ఒక మహిళ( Woman ) కూడా రోడ్డు ఎలా దాటాలో తెలియక చివరికి తీవ్ర గాయాల పాలయ్యింది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో ఓపెన్ చేస్తే, రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక మహిళను మనం చూడవచ్చు.అదే రోడ్డు మీద ఒక బైకర్‌( Biker ) వేగంగా దూసుకొస్తున్నాడు.

అయితే ఈ మహిళ ఆ బైకును గమనించింది.ఆ తర్వాత రోడ్డు దాటడం ప్రారంభించింది.

ఆ బైకు ఆమెకు దూరంలోనే ఉంది.కానీ ఆమె ఎందుకో బైక్ ని చూసి అలాగే రోడ్డు మధ్యలో ఆగిపోయింది.

ముందుకు గానీ వెనకకు గానీ అడుగు వెయ్యలేదు.బైక్ కి స్ట్రైట్ గా ఉండిపోయింది.

బైక్ రైడర్( Bike Rider ) రోడ్డు మధ్యలో ఉన్న ఆమెను కచ్చితంగా చూసే ఉంటాడు.అతను కావాలనుకుంటే హ్యాండిల్ తెప్పి ఆమెకు తగలకుండా వెళ్లిపోవచ్చు కానీ అతడు కూడా ఆ మహిళ రోడ్డు మధ్యలో ఉండటాన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు.ఆమె ఎటువైపైనా కదులుతుందో అని స్ట్రైట్ గా బండి ఫోన్ ఇచ్చాడు.చివరికి బైకర్ ఆ మహిళను బలంగా ఢీకొట్టాడు.దీనివల్ల ఆమె ఎగిరి చాలా దూరంలో పడింది.యాక్సిడెంట్లో ఇద్దరికీ బాగానే గాయాలైనట్లు తెలుస్తోంది.

ఈ వీడియో చూసిన వారు ఇలా ఎప్పుడూ రోడ్డు మధ్యలో ఆగిపోకూడదని, లేదంటే డ్రైవర్లు ఊహించని విధంగా డైరెక్షన్ మార్చకూడదని హెచ్చరిస్తున్నారు.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube