కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం.. బీసీసీఐ భారీ జరిమానా..!

తాజాగా బెంగళూరు – లక్నో( RCB vs LSG ) మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించింది.అయితే మ్యాచ్ మధ్యలో ఓ చిన్నపాటి వివాదం జరగడంతో బీసీసీఐ సీరియస్ అవడంతో పాటు భారీ జరిమానా విధించింది.

 Bcci Huge Fine For Virat Kohli And Gautam Gambhir Ipl 2023 Details, Bcci ,fine ,-TeluguStop.com

ఇరుజట్ల సభ్యులు షేక్ హాండ్స్ ఇచ్చుకునే సమయంలో లక్నో జట్టు ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కు విరాట్ కోహ్లీ కి మధ్య వివాదం జరిగింది.పక్కనే ఉన్న మ్యాక్స్ వెల్ వచ్చి వివాదం ముదరకుండా అడ్డుకున్నాడు.

కాసేపటికి విరాట్ కోహ్లీ( Virat Kohli ) లక్నో ఓపెనర్ కేల్ మేయర్స్ తో సంభాషిస్తున్న సమయంలో లక్నో జట్టు కోచ్ గంభీర్( Gautam Gambhir ) వచ్చి మేయర్స్ ను పక్కకు తీసుకెళ్లాడు.దీంతో కోహ్లీ, గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

వీరిద్దరి మధ్య గొడవ ముదరకుండా విరాట్ కోహ్లీని, అమిత్ మిశ్రా పక్కకు తీసుకెళ్లగా.గౌతమ్ గంభీర్ ను కేఎల్ రాహుల్ పక్కకు తీసుకెళ్లి సముదాయించారు.ఇంతటితో గొడవ ముదరకుండా ముగిసింది.కానీ గ్రౌండ్లో జరిగిన గొడవపై బీసీసీఐ కాస్త సీరియస్ అయింది.ఐపీఎల్ నిబంధనలను ఇరుజట్ల ఆటగాళ్లు ఊల్లంగించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ జరిమానా విధించింది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.21 కింద లెవెల్ 2 నిబంధనను తాను ఉల్లంఘించినట్లు గౌతమ్ గంభీర్ అంగీకరించాడు.ఇక విరాట్ కోహ్లీ కూడా తాను లెవల్ 2 నిబంధనను ఉల్లంఘించినట్లు అంగీకరించాడు.

దీంతో వీరిద్దరితోపాటు నవీన్ ఉల్ హక్ కు కూడా భారీ జరిమానా విధించబడింది.విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 100% ఫైన్ విధించబడింది.అంటే రూ.1.07 కోట్ల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.నవీన్ ఉల్ హక్ కు మ్యాచ్ ఫీజులో 50% ఫైన్ విధించబడింది.అంటే రూ.1.79 లక్షలు.ఇక లక్నో జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ కు రూ.25 లక్షల ఫైన్ విధించబడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube