ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నంది అవార్డుల విషయమై పట్టించుకోవడం లేదని.ఒక వేళ వారు అవార్డులు ఇస్తే గూండ.
రౌడీ అవార్డులు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది అంటూ నిర్మాత అశ్వినీదత్( ashwini dutt ) వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.ఆయన వ్యాఖ్యలను వైకాపా నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీ వల్ల ఏపీకి ప్రయోజనం పెద్దగా లేదు.అందువల్ల నంది అవార్డులను ఇవ్వాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా వారు ప్రశ్నిస్తున్నారు.
పెద్ద ఎత్తున నంది అవార్డులకు సంబంధించిన అశ్వినీదత్ వ్యాక్యలు విమర్శల పాలు అవుతున్నాయి.ఆయన తెలుగు దేశం పార్టీ నాయకుడిగా మాట్లాడాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అశ్వినీదత్ కామెంట్స్ ప్రస్తుతం ఆయన సినిమాల పై పడబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ మరియు అశ్వినీదత్ కాంబోలో ప్రాజెక్ట్ కే( Project K ) అనే సినిమా వస్తున్న విషయం తెల్సిందే.

సినిమా కు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది.వచ్చే ఏడాది సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.వచ్చే ఏడాది లో వైకాపా నుండి సినిమా విడుదల సమయంలో కచ్చితంగా షాక్ తగిలే అవకాశాలు లేకపోలేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియాలో వైకాపా వారు ఇప్పటికే ప్రాజెక్ట్ కే సినిమాను ఓ రేంజ్ లో ఆడుకుంటాం అన్నట్లుగా హెచ్చరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలకు ఏపీలో ఎదురు అవుతున్న పరిస్థితులు గుర్తు లేవా.అయినా కూడా వైకాపా ప్రభుత్వం గురించి విమర్శలు చేసే స్థాయి మీదా అంటూ కొందరు అశ్వినీదత్ ను విమర్శిస్తున్నారు.ఇప్పటికే పోసాని ఓ రేంజ్ లో అశ్వినీదత్ ను విమర్శించిన విషయం తెల్సిందే.
ముందు ముందు అశ్వినీదత్ పై వైకాపా శ్రేణుల మాటల యుద్దం ఖాయం.







