తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా విభాగాలు ఉన్నప్పటికీ మ్యూజిక్ అనేది సినిమాలో చాలా కీలక పాత్ర వహిస్తుంది అలాంటి మ్యూజిక్ లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాటను ఎవరితో పాడించాలి ఆ పాట ఎవరు పడితే ఎక్కువగా హిట్ అవుతుంది అని తనకు తాను నిర్ణయించుకొని ఒక సింగర్ తో పాడించడం జరుగుతుంది.అయితే ఈమధ్య చాలామంది ఇండస్ట్రీ కి వస్తున్నారు.
అప్పట్లో పాడుతా తీయగా లాంటి ప్రోగ్రాం ద్వారా చాలామంది సింగర్స్ ఇండస్ట్రీకి వచ్చి తెలుగు సినిమాల్లో సాంగ్స్ పాడారు అలాంటి వారిలో సింగర్ మల్లికార్జున గారు ఒకరు.అలాగే పాప్ ఐడల్ ను మన దేశంలో సోని ఎంటర్టైన్మెంట్ ఇండియన్ ఐడల్ గా దేశీ వెర్షన్ గా 2004 లో తీసుకుని వచ్చింది.
ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రతిభావంతులైన గాయకులు వెలుగులోకి వస్తున్నారు.సంగీతంలో ఉన్న తమ ప్రతిభను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు.
అయితే ఈ ఇండియన్ ఐడల్ సీజన్లలో అనేకమంది తెలుగు గాయనీగాయకులు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్నారు.ఈ రియాలిటీ షో యొక్క తాజా సీజన్ కూడా దీనికి మినహాయింపు కాదు.
వైజాగ్ నుండి వచ్చిన షణ్ముఖ ప్రియా, శిరీష భాగవతుల ఇద్దరూ తమవిలక్షణమైన గాత్రంతో సమ్మొనహమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన సంగీత ప్రదర్శన షోలో ఇప్పటి వరకూ ప్రకాశించిన తెలుగుగాయనీగాయకులు గురించి ఈ రోజు తెలుసుకుందాం!
1 కారుణ్య
బుల్లి తెరపై అత్యంత ప్రతిష్టాత్మక షో ఇండియన్ ఐడల్ లో తెలుగు గాయనీగాయకులు కూడా పాల్గొనడానికి మార్గం ఏర్పరచింది కారుణ్య.
ఇండియన్ ఐడల్ రెండవ సీజన్లో రన్నరప్ గా నిలిచాడు.తన గానంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.
తెలుగులో అనేక సినిమాల్లో కారుణ్య పాటలను పాడుతున్నడు.ఖలేజా సినిమాలో ఓం నమో శివ రుద్రాయ సాంగ్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అలాగే మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన చాలా సినిమాల్లో కూడా కారుణ్య పాటలు పాడాడు.ఇక ఆ సీజన్ లో సందీప్ ఆచార్య టైటిల్ విన్నర్ గా నిలిచాడు.
2 శ్రీరామ చంద్ర మైనంపాటి
శ్రీ రామ చంద్ర ఇండియన్ ఐడల్ లో పాల్గొనక ముందు తెలుగు సినిమాల్లోని పలు సాంగ్స్ కు ట్రాక్ సింగర్ గా పనిచేశాడు.అష్టా చమ్మ వంటి అనేక సినిమాల్లోని ట్రాక్‌తో సహా కొన్ని తెలుగు పాటలు పాడారు.ఇండియన్ ఐడల్ విజేతగా టైటిల్ గెలుచుకున్న తరువాత శ్రీరామ చంద్ర టాలీవుడ్, బాలీవుడ్ లో పలు అవకాశాలను అందుకున్నాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సాంగ్స్ పాడాడు.
3 ఎల్వి రేవంత్
బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాలో మనోహరి సాంగ్ కు ట్రాక్ ను పాడి అందరి దృష్టిని ఆకర్షించాడు రేవంత్.అనంతరం 2017 లో ఇండియన్ ఐడల్ 9 లో పాల్గొన్నాడు.ఆ సీజన్ విన్నర్ గా నిలిచి సంగీత ప్రేమికుల మనసును దోచాడు.వైజాగ్‌కు చెందిన రేవంత్ తెలుగు, కన్నడ చిత్రాల్లో పలు పాటలు పాడారు.ప్రస్తుతం తెలుగులో లో రేవంత్ టాప్ సింగర్ గా దూసుకుపోతున్నాడు.
4 పివిఎన్ఎస్ రోహిత్
ఇండియన్ ఐడల్ 9 లో రేవంత్ తో పాటు పాల్గొన్న మరో తెలుగు గాయకుడు పివిఎన్ఎస్ రోహిత్.పాపులర్ సింగర్ సుఖ్వీందర్ సింగ్ కు రోహిత్ ను తన గాత్రంతో ఆకట్టుకున్నాడు.పివిఎన్ఎస్ రోహిత్ ఇండియన్ ఐడల్ 9 లో టాప్ 3 లో చోటు దక్కించుకున్నాడు.
5 షణ్ముఖ ప్రియా
ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 12 టైటిల్ కోసం పోటీ పడుతున్న వైజాగ్‌కు చెందిన పదిహేడేళ్ల బాలిక షణ్ముఖ ప్రియ.ఆమె అసాధారణమైన యోడెల్లింగ్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది.ఐదేళ్ల వయస్సు నుండే పలు షోల్లో పాల్గొన్న షణ్ముఖ ప్రియ జీ సరిగమ లిటిల్ చాంప్స్ 2017 లో ఫైనలిస్ట్.
6 శిరీషా భాగవతుల
ఇండియన్ ఐడల్ 12 లో మరో తెలుగింటి అమ్మాయి శిరీషా భాగవతుల.చిత్ర జీ అనే ముద్దు ప్రేమతో పిలుచుకునే శిరీష పేమస్ అయ్యింది.శ్రావ్యమైన శిరీష చిత్ర ని గుర్తు చేస్తుందని న్యాయనిర్ణేతలు అంటారు.21 ఏళ్ల ఈ ఇంజనీర్ తన గానంతో న్యాయనిర్ణేతలనీ అలరిస్తుంది.వీళ్లే కాకుండా ఇంకా ముందు ముందు తెలుగు సింగర్స్ ఎంతమంది పాల్గొని టైటిల్ని గెలుచుకుంటారో చూద్దాం.
.