టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు తమ వారసులను తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక ఇప్పుడు స్టార్ హీరోల వారసులు పరిచయం కావాల్సిన వారు చాలా మంది ఉన్నారు.
ప్రెజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.
బాలయ్య తన వారసుడును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.దీనిపై ఆసక్తికర చర్చలు కూడా జరుగుతున్నాయి.ప్రెజెంట్ బాలయ్య క్రేజ్ అమాంతం పెరగడంతో ఈయన కొడుకు ఎంట్రీపై కూడా ఆసక్తిగా ఉన్నారు.బాలయ్య తన వారసుడి ఎంట్రీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈయన తన కొడుకు మొదటి సినిమాను తానే డైరెక్ట్ చేస్తానని ఎప్పుడో తెలిపాడు.కానీ మధ్యలో యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని( Gopichand Malineni ) దర్శకత్వంలో ఈయన ఎంట్రీ ఉండవచ్చని టాక్ వినిపించింది.బాలయ్యతో వీరసింహారెడ్డి( Veerasimha Reddy ) తీసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ కు కూడా ఈయన నచ్చేసాడు.ఇక తాజాగా నందమూరి మోక్షజ్ఞకు గోపీచంద్ మలినేనికి మధ్య ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ నడిచింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.వారు ఏం మాట్లాడు కుంటున్నారో తెలియదు కానీ ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఇద్దరు వేరే వారితో సంబంధం లేకుండా మంచి ఫ్రెండ్లీ డీల్ మాట్లాడు కుంటున్నట్టు అనిపిస్తుంది.
ఇది ఏమైనా సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది.