దసరా పండుగ కానుకగా విడుదలైన సినిమాలలో ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఏదనే ప్రశ్నకు భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది.భగవంత్ కేసరి సినిమాతో పోల్చి చూస్తే లియో, టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
సీనియర్ స్టార్ హీరోలలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో బాలయ్యేనని ( Balakrishna ) ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.వరుసగా విజయాలు సాధించడం వల్ల బాలయ్య ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.
మిగతా సీనియర్ హీరోల సినిమాలలో కొన్ని సినిమాలు బాలయ్య సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధిస్తున్నా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం బాలయ్య సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తుండటంతో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కెరీర్ లో సైతం భగవంత్ కేసరి మూవీ స్పెషల్ గా నిలుస్తోంది.
బాలయ్య సినిమాలు సులువుగా 70 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తున్నాయి.
బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీగా నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం.భగవంత్ కేసరిలో కామెడీ డైలాగ్స్ తక్కువగానే ఉన్నా ఆ డైలాగ్స్ భారీ రేంజ్ లో పేలాయి.బాలయ్య రెమ్యునరేషన్( Balakrishna Remuneration ) భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.
నందమూరి బాలకృష్ణ మల్టీస్టారర్ సినిమాలకు సైతం దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
బాలయ్య ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించే దిశగా అడుగు పెడితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.బాలయ్య సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుండటం గమనార్హం.
అనిల్ రావిపూడి రెమ్యునరేషన్ ఈ సినిమాతో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.పండుగలను టార్గెట్ చేసుకుని బాలయ్య సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం.