నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా వెండి తెరపై ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా తనలో ఉన్నటువంటి టాలెంట్ బయటపెట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ ( Unstoppable ) అనే కార్యక్రమం ప్రసారమైన విషయం తెలిసిందే .
ఈ కార్యక్రమం ఇప్పటికే రెండు సీజన్లను పూర్తిచేసుకుని మూడవ సీజన్ కూడా ప్రారంభమైంది.ఇలా మొదటి రెండు ఎపిసోడ్లు ఎంతో మంచి ఆదరణ పొందడంతో మూడవ సీజన్ కూడా ప్రారంభించారు.
ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించినటువంటి మొదటి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
మూడవ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా టీం హాజరయ్యి సందడి చేశారు.ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సినిమా విశేషాలతో పాటు రాజకీయ విషయాలను కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు.ముఖ్యంగా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ కావడంతో ఆయన గురించి ఈ కార్యక్రమంలో బాలయ్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలయ్య డైలాగ్ చెబుతూ….మా మాట మీకు సుపరిచితం.మా బాట మీకు సుపరిచితం.మేమేంటో, మా వాళ్లేంటో మా వెంట ఉండే మీకు సదా నమ్మకం.
రోజులు మారినా, రుతులు రంగులు మార్చినా, ఎన్ని అమావాస్యలు చీకట్లు చిమ్మినా మళ్ళీ చంద్రుడు ఉదయిస్తూనే ఉంటాడు.
మేము తప్పుచేయలేదని మీకు తెలుసు.మేము తల వంచమని మీకు తెలుసు.మనల్ని ఆపడానికి ఎవరూ రాలేదని మీకు తెలుసు.
మేము మీకు తెలుసు, మా స్థానం మీ మనసు.గుండె బరువెక్కినా, కన్ను చినుకుపట్టినా, చెదరని చిరునవ్వుని పెదవికి పూయించే బాలయ్య మీ సొంతం.
అందుకే అనిపించింది అందాం, అనుకున్నది చేద్దాం.ఎవడాపుతాడో చూద్దాం అని బాలయ్య చెప్పారు.
ఇలా బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్( Balakrishna Dialogues ) చూస్తుంటే కనుక ఈయన కచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే ఈ డైలాగ్ చెప్పారని చంద్రబాబు కి ఎన్ని అవమానాలు ఎదురైనా తిరిగి నిండు చంద్రుడిలా ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తారు అన్న ఉద్దేశంతోనే బాలకృష్ణ ఇలాంటి డైలాగ్ చెప్పారని స్పష్టంగా అర్థమవుతుంది.ప్రస్తుతం బాలయ్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.