ఆడబిడ్డకు ఎక్కడా చోటు లేదా.పసికందు నుంచి 60 ఏళ్ల బామ్మ వరకు.
వివక్ష ఎందుకు.మహిళలగా వారు పుట్టడం వాళ్ల శాపమా.
లేక వారు చేసుకున్న పాపమా.తల్లి పొత్తిళ్ళలో హాయిగా నిద్రపో వలసిన శిశువు చెత్తకుప్పలోకి చేరింది.
కళ్ళు తెరవని ఆ పసికందు చెత్తకుప్పలో ఆకలికేకల తో దర్శనమిచ్చింది.వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం.
శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్త కుప్పల మధ్య కళ్ళు తెరవని పసికందు చెత్తకుప్పలో ఆదివారం ఓ ఆడశిశువు ఆకలి కేకలతో కనిపించింది.శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వేంటనే అక్కడకు ఎస్సై విజయ్ కుమార్ శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఐదు రోజుల పుట్టిన ఆడశిశువు గా వైద్యులు గుర్తించారు.డంపింగ్ యార్డులో శిశువు వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు.
కళ్ళు తెరవని ఆ పసికందు తల్లి పొత్తిళ్ళలో హాయిగా నిద్రపో వలసిన శిశువు చెత్తకుప్పలోకి చేరిందని సంఘటన చూచి స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.మహాలక్ష్మి లాంటి ఈ బిడ్డను ఎలా చెత్తకుప్పలో వదిలేయడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు.