సినిమా ఇండస్టీకి చెందిన హీరోహీరోయిన్లు పాజిటివ్ సెంటిమెంట్లతో పోలిస్తే నెగిటివ్ సెంటిమెంట్ల విషయంలో ఎక్కువగా టెన్షన్ పడతారు.నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ఫిదాతో సక్సెస్ సాధించిన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా వచ్చే నెల 10వ తేదీన వినాయక చవితి కానుకగా రిలీజ్ కానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన నెగటివ్ సెంటిమెంట్ నాగచైతన్యను భయపెడుతోందని తెలుస్తోంది.
ఫిదా తర్వాత తెలుగులో సాయిపల్లవి నటించిన సినిమాలు సైతం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
మజిలీ, వెంకీమామ విజయాల తర్వాత చైతన్య నటిస్తున్న లవ్ స్టోరీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.
చైతన్య తొలి సినిమా జోష్ సెప్టెంబర్ నెలలోనే విడుదలైంది.అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అయింది.
వాసువర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది.ఆ తర్వాత నాగచైతన్య హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన యుద్ధం శరణం సినిమా కూడా సెప్టెంబర్ నెలలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.మారుతి డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు కూడా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
లవ్ స్టోరీ సినిమా కూడా సెప్టెంబర్ లో రిలీజ్ కానుండగా ఈ సినిమా నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.అక్కినేని ఫ్యాన్స్ కూడా లవ్ స్టోరీ రిజల్ట్ కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.