మనలో కొంతమంది రోజువారీ వ్యాయామంలో భాగంగా పుష్-అప్స్( PushUps ) చేస్తూ వుంటారు.ఎందుకంటే పుష్-అప్స్ అనేవి మనిషికి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా ఇస్తాయి.
అప్పర్ బాడీ మంచి షేప్ రావడానికి, దృఢంగా మారడానికి పుష్-అప్స్ బాగా సహకరిస్తాయి అని నిపుణులు చెబుతూ వుంటారు.అయితే ఎక్కువ పుష్-అప్స్ చేయాలంటే ఓ మంచి ఫిట్‌నెస్ మొదట ఉండి తీరాలి.
పుష్-అప్స్ చూడడానికి ఈజీగా కనబడినప్పటికీ అవి చేసేటప్పుడు మాత్రం తాట తెగిపోతుంది.వరుసగా 50 పుష్-అప్స్ తీయడం అంటేనే చాలా కష్టం.
ఇక ఆగకుండా 100 పుష్-అప్స్ చేసిన వారిని చాలా గొప్పగా చూస్తుంటాం.అయితే ఓ వ్యక్తి గంటలో ఏకంగా 3249 పుష్-అప్స్ తీసాడు అంటే మీరు నమ్ముతారా?
నిజం, ఆ రికార్డు సాధించడంతో అతగాడు ఏకంగా ఇపుడు గిన్నిస్ వరల్డ్ రికార్డును( Guinness World Record ) బద్దలు కొట్టాడు.ఆస్ట్రేలియాకు( Australia ) చెందిన ఫిట్‌నెస్ ప్రియుడు డానియేల్( Daniel ) ఒక గంటలో ఆగకుండా ఏకంగా 3249 పుష్-అప్స్ చేసి ఆహుతులను అవాక్కయేలా చేసాడు.గతంలో కూడా ఆస్ట్రేలియాకే చెందిన యోల్డ్ లుకాస్ హెల్మ్కే అనే అథ్లెట్ ఒక గంటలో 3206 పుష్-అప్స్ తీసి గిన్నీస్ రికార్డు సాధించగా తాజాగా ఆ రికార్డును డానియేల్ బద్దలు కొట్టడం విశేషం.
అదే దేశస్తుడు కావడం గమర్హం.అయితే డానియేల్ ఆ రికార్డు సాధించడానికి అహర్నిశలు శ్రమించాడు.అది మాత్రమేకాకుండా డానియేల్ చిన్నప్పటి నుంచి ఏడమ చేతి నొప్పితో బాధపడుతున్నాడట.అలాంటి గడ్డు పరిస్థితులలో కూడా అతగాడు ఈ ఘటన సాధించడం హర్షణీయం.
గతేడాది ఏప్రిల్‌లో డానియేల్ ఒక గంటలో 3182 పుష్-అప్స్ చేసి రికార్డు సృష్టించాడు.ఆ రికార్డును ఆస్ట్రేలియాకే చెందిన యోల్డ్ లుకాస్ నవంబర్‌లో అధిగమించగా తాజాగా లుకాస్ రికార్డును డానియేల్ దాటేసి మళ్లీ నెంబర్ వన్‌కు స్థానానికి చేరుకోవడం విశేషం.కాగా డానియేల్ రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ వీడియోని స్వయంగా గిన్నిస్ తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేయడం ద్వారా అనేకమంది ఈ విషయాన్ని తెలుసుకున్నారు.
ఈ క్రమంలో డానియేల్ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియా జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.