తెల్లారేసరికి స్కూలు నిండా లిక్కర్ బాటిళ్లు.. ఆశ్చర్యపోయిన టీచర్లు

నేరాలు ఎక్కువగా జరిగే బీహార్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆ రాష్ట్రంలో మద్య నిషేధం ప్రకటించింది.

 At Dawn, The School Was Full Of Liquor Bottles The Teachers Were Surprised , Sc-TeluguStop.com

దీంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.ఆ రాష్ట్రం మొత్తంగా నాటు సారా కాస్తున్నారు.

ఇవే కాకుండా లిక్కర్‌ను అక్రమంగా దాచి, గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.ఈ తరుణంలో వారు అడ్డదారులు దొక్కుతున్నారు.

తాజాగా జరిగిన ఓ సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.బీహార్‌లోని వైశాలి జిల్లాలోని ఓ పాఠశాలలో పోలీసులు దాడులు నిర్వహించగా, 140 కార్టన్‌ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఓ పాఠశాల నుంచి ఇంత భారీగా మద్యం తరలిపోవడంతో పోలీసుల నుంచి ప్రజల వరకు అందరూ ఉలిక్కిపడ్డారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగళవారం రాత్రి పాఠశాలకు తాళాలు వేసుకుని వెళ్లిపోయాడు.

తీరా ఉదయం చూసేసరికి వేరే తాళాలు ఉన్నాయి.తీరా పాఠశాల లోపలికి వెళ్లి చూడగా, మద్యం ప్యాక్ చేసిన డబ్బాలు భారీగా ఉన్నాయి.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

వైశాలి జిల్లా బృందావన్‌లో ఉన్న ఖంజచక్ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పవన్ కుమార్ శుక్లా దీనిపై స్పందించారు.పాఠశాలలోని ఒక గది తాళం పగులగొట్టి దాని స్థానంలో కొత్త తాళం పెట్టినట్లు బుధవారం ఉదయం తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.

అనంతరం పాఠశాలకు చేరుకున్న ప్రధానోపాధ్యాయుడు స్థానిక ప్రజాప్రతినిధులను పిలిపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సమాచారం అందుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ బ్రిజేష్ సింగ్, పోలీసులు 140 కార్టన్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మంగళవారం రాత్రి ఎవరో గది తాళం పగులగొట్టి మద్యాన్ని అక్కడే ఉంచారని తెలిపారు.అనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.దీనిని తెలుసుకున్న వారంతా అవాక్కవుతున్నారు.

పాఠశాలను మద్యం బాటిళ్లతో నింపేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube