కిరాణా వస్తువులు కొందామని షాప్‌కి వెళ్లాడు.. రూ.4 కోట్లతో తిరిగొచ్చాడు..??

చాలా మంది కోట్లాది రూపాయలు సంపాదించి జీవితాన్ని సులభతరం చేసుకోవాలని కలలు కంటారు.లాటరీ టిక్కెట్ల( Lottery tickets )తో కష్టపడకుండానే ఒక జీవితానికి సరిపడా డబ్బులు పొందవచ్చు.

 He Went To The Shop To Buy Groceries.. He Returned With Rs. 4 Crores, Lucky Pers-TeluguStop.com

ఈ సింపుల్ మార్గాన్ని నేర్చుకోవడానికి చాలామంది ఇష్టపడతారు.అయినప్పటికీ డబ్బులు గెలుచుకునే అవకాశాలు చాలా తక్కువ.

కొంతమంది అంత ట్రై చేసినా లాటరీ తగలదు.మరి కొంతమందికి మాత్రం అనుకోకుండా లాటరీ తగిలి పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకుంటారు.

Telugu Grocery Store, Lottery Jackpot, Lucky Person, Nri, Russell Gomes, Boston,

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వర్జీనియాలోని దక్షిణ బోస్టన్‌( South Boston )కు చెందిన ట్రక్ డ్రైవర్ కూడా ఇలాగే అనుకోకుండా లాటరీ గెలుచుకున్నాడు.దాంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది.ఈ అదృష్టవంతుడి పేరు రస్సెల్ గోమ్స్( Russell Gomes)ఇతను ఇటీవల ఒక గ్రోసెరీ స్టోర్ నుంచి లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసి, చివరికి ఒక పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నాడు.అతను డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అవసరమైన పదార్థాలను కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లాడు, కానీ కోటీశ్వరుడిగా బయటకు వచ్చాడు.

Telugu Grocery Store, Lottery Jackpot, Lucky Person, Nri, Russell Gomes, Boston,

ఆ రోజు ట్రక్ డ్రైవర్ రస్సెల్ దుకాణంలో చాలా లాటరీ టిక్కెట్లు అమ్ముతున్నట్లు చూశాడు.తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించి ఒక టిక్కెట్ కొన్నాడు.షాపింగ్ ముగించుకున్నాక, కారు పార్కింగ్‌లో టిక్కెట్‌ను గీకి, భారీ బహుమతి గెలుచుకున్నట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.వర్జీనియా లాటరీ( Virginia Lottery ) “మెగ్నిఫిసెంట్ 7s” ఆటలో ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నట్లు నమ్మలేకపోయాడు.

రస్సెల్ కు లాటరీలో దాదాపు $500,000 బహుమతి లభించింది, ఇది సుమారు 4 కోట్ల రూపాయలకు సమానం.ఈ డబ్బు గెలుచుకోవడంతో ఈ ట్రక్కు డ్రైవర్ బాగా ఆశ్చర్యపోయాడు.

దాన్ని ఎలా ఖర్చు చేయాలో వెంటనే ఆలోచించడం ప్రారంభించాడు.రస్సెల్ కు చాలా కాలంగా నెరవేర్చుకోవాలనుకుంటున్న కలలు అనేకం ఉన్నాయి.

మొదట, ఎంతో కాలంగా వెళ్లాలని కోరుకుంటున్న వెకేషన్ ప్లాన్ చేశాడు.ఆ తర్వాత, మిగిలిన డబ్బును ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకుంటాడు.

రస్సెల్ ఆడిన “మెగ్నిఫిసెంట్ 7s” ఆటలో 20 డాలర్ల నుంచి 500,000 డాలర్ల వరకు బహుమతులు లభిస్తాయి.రస్సెల్ లాగా పెద్ద బహుమతి గెలుచుకోవాలని ఆశించే లక్షల మంది ప్రజలు ఈ ఆటను ఆడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube