ఈ నైజీరియన్ మహిళ ఎలాంటి లక్షణంతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిందో తెలిస్తే..

సాధారణంగా వరల్డ్ రికార్డు( World record ) బ్రేక్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.ఫిజికల్ ఫీచర్స్ తో కూడా వరల్డ్ రికార్డు బ్రేక్ చేయవచ్చు.

 If You Know With What Feature This Nigerian Woman Broke The World Record, Guinn-TeluguStop.com

ఇలాంటి ఫిజికల్ ఫీచర్లు పుట్టుకతోనే రావాలి.లేదంటే కష్టపడి వాటిని చాలా ప్రత్యేకంగా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఒక నైజీరియన్ మహిళ సింపుల్ విగ్‌తో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

ప్రపంచంలోనే వైడెస్ట్ విగ్‌( Widest wig )తో ఆమె ఈ రికార్డ్‌ను నెలకొల్పింది.అయితే జుట్టే కదా, అది కూడా ఎవరిదో సేకరించి తయారు చేసినదే కదా ఇందులో గొప్పేముంది అని చాలామంది అనుకోవచ్చు.

కానీ దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ విగ్ 3.65 మీటర్ల వెడల్పుతో ఉంది, ఇది దాదాపు 12 అడుగులకు సమానం.దీనిని తయారు చేయడానికి 800 బండ్ల ఆబర్న్ రంగు జుట్టును ఆమె ఉపయోగించింది.

ఈ ప్రాజెక్ట్‌పై పని చేయడానికి ఈ మహిళకు చాలా నెలలు పట్టింది.ఈ విగ్‌ను తయారు చేయడానికి 4,138,200 నైరా (దాదాపు 229,000 రూపాయలు) ఖర్చయ్యింది.

నిజానికి ఆమె ఒక ప్రొఫెషనల్ విగ్ మేకర్.

ఆమె ఈ విగ్‌ను చాలా వరకు చేతితోనే తయారు చేసింది.కొన్ని భాగాలను కుట్టు మెషిన్‌తో కుట్టింది.సూది, ధాగాతో ఒక ఫ్రేమ్‌కు జాగ్రత్తగా కుట్టింది.మెరుపును జోడించడానికి 1,000 కి పైగా మెరిసే రాయిలతో అలంకరించింది.30 సెకన్లలో ఒక విగ్‌లో అత్యధిక హెయిర్ క్లిప్‌లను అమర్చి మరో రికార్డును కూడా ఆమె క్రియేట్ చేసింది.మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.సవాలుతో కూడిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం వల్ల నైపుణ్యాలు మెరుగుపడతాయని, విలువైన పాఠాలు నేర్చుకోగలనని ఆమె నమ్ముతుంది.గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్( Guinness World Records ) ఆమె తయారుచేసిన విగ్గును ఓ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో ద్వారా చూపించింది.ఈ వీడియోలో విగ్ అద్భుతమైన వెడల్పు కనిపించింది.

ఈ విగ్‌ను క్రియేట్ చేసేటప్పుడు విగ్ పరిమాణం, బరువు కారణంగా వెన్నునొప్పి, మెడ నొప్పి తలెత్తిందని ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube