టి ఆర్ ఎస్ అసంతృప్తులు రేవంత్ వైపు చూస్తున్నారా..?

అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏ పదవులు లేక రాజకీయ నిరుద్యోగులు గా ఉన్న నేతలంతా కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి పంచన చేరితే పార్టీలో కుదుపులు తప్పేలా కనిపించడం లేదని గులాబీ నేతలు కంగారు పడుతున్నారట.ఇందుకోసం అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించేందుకు జిల్లాల వారిగా సమావేశాలు పెట్టాలని చూస్తున్నారట.

 Are Trs Dissidents Looking Towards Rewanth Revant Reddy, Tpcc, Trs, Ts Poltics-TeluguStop.com

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రాధాన్యం దక్కడం లేదని ఆలోచిస్తున్న వారంతా రేవంత్ రెడ్డి తో కలిసి నడిస్తే ప్రమాదమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇందుకు తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కూడా పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిన మరు క్షణమే మాటల దాడిని ప్రారంభించాడు.

తెలంగాణ రాష్ర్టంలో భవిష్యత్ లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.సీనియర్లు కలిసి రాకున్నా తనకున్న క్యాడర్ తో ముందుకు సాగుతున్నారు.

రేవంత్ రెడ్డికి బయటి వాళ్లతో కన్నా సొంత పార్టీ వాళ్లతోనే పోరు ఎక్కవైనట్లు కనిపిస్తోంది.ఇప్పటికే పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించాక పార్టీకి రాజీనామాలు చేశారు.

కానీ వారి రాజీనామాలేవీ రేవంత్ రెడ్డిని వెనుకడుగు వేసేలా చేయట్లేదు.ఎంత మంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తాను అనుకున్నది తప్పక సాధిస్తానని రేవంత్ రెడ్డి తన అనుచర వర్గం వద్ద ప్రస్తావిస్తున్నాడట.

Telugu Komati Reddy, Revant Reddy, Revanth Reddy, Telengana, Tpcc, Ts Congress,

టీపీసీసీ ఛీఫ్ ఎంపిక ప్రక్రియ మొదలైన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకూడదని అధిష్టానానికి పలు సందర్భాల్లో లేఖలు రాశారు.కానీ అధిష్టానం అవేమీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డికే టీపీసీసీని ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.దీంతో అలిగిన కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తూ తమ వ్యతిరేఖతను వెలిబుచ్చుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube