జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన పోలీస్‌ శాఖను అభినందించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్‌ శాఖను మనస్పూర్తిగా అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్ధానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి.సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పోలీస్‌ ఉన్నతాధికారులు, స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే రిపోర్ట్‌ను సీఎంకి అందజేసి వివరాలు వెల్లడించిన డీజీపీ.

 Ap Cm Jagan Appreciated Ap Police Department For Getting Number One Rank In Frie-TeluguStop.com

స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్‌ వన్‌ ర్యాంక్.ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడి.

స్మార్ట్‌ పోలీసింగ్‌పై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించిన ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్, తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాలలో సర్వే.2014 డీజీపీల సదస్సులో స్మార్ట్‌ పోలీసింగ్‌ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు.ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న రాష్ట్రాలలో ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వే.ఏడేళ్ళుగా నిర్వహిస్తున్న సర్వేలో తొలిసారిగా మొదటి ర్యాంకు ను సాధించిన ఏపీ పోలీస్‌ శాఖ.ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వే నిర్వహించిన ఐపిఎఫ్‌.ఐపిఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్‌ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులు.

Telugu Ap Cm Jagan, Apdgp, Ap, Friendly, Indian, Number-Political

ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ద, పారదర్శక పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్‌ వన్.పోలీస్‌ సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీస్‌ వ్యవస్ధ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకింగ్‌.డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, అడిషనల్‌ డీజీ (బెటాలియన్స్‌) శంకబ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) పాలరాజు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube