న్యూస్ రౌండప్ టాప్ 20

1.రేపు వైఎస్సార్ రైతు భరోసా నిధులు జమ

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.వైఎస్సార్ రైతు భరోసా కింద 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలివిడత నిధులను రేపు జమ చేయనున్నారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.రేపు ఏలూరు జిల్లాలో జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు గణపవరం లో జరిగే రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన బోతున్నారు.

3.ఖమ్మం జిల్లాలో బండి సంజయ్ పర్యటన

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

నేడు ఖమ్మం జిల్లాలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు బిజెపి కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు.

4.నేటితో ముగియనున్న కాంగ్రెస్ సమావేశాలు

ఉదయపూర్ లో నేటితో కాంగ్రెస్ సమావేశాలు ముగుస్తాయి.

5.విశాఖలో నేడు బీచ్ క్లీన్ డ్రైవ్

నేడు విశాఖ లో బీచ్ క్లీన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు , ఎన్జీవోలు పాల్గొన్నారు.

6.అభిమానులకు నాగబాబు విజ్ఞప్తి

జనసేన అభిమానులకు నాగబాబు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ నెల 17న ఉత్తరాంధ్రలో ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

7.హరీష్ రావు సవాల్

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

కేంద్ర హోంమంత్రి అమిత్ షా టిఆర్ఎస్ ప్రభుత్వం పై చేసిన విమర్శలపై మంత్రి హరీష్ రావు స్పందించారు.బిజెపి నాయకులు అమిత్ షా చెప్పిన అబద్దాలను నిరూపించాలని హరీష్ రావు చేశారు.

8.కాంగ్రెస్ పాదయాత్రలు

కాశ్మీర్ నుంచి కన్యకుమారి వరకు పాదయాత్రలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.

9.మోదీ కి లీగల్ నోటీస్

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి కర్ణాటకలోని హనుమత్ జన్మభూమి ట్రస్ట్ .గోవిందానంద సరస్వతి లీగల్ నోటీసు పంపించారు.టీటీడీ అదనపు ధర్మారెడ్డి డిప్యూటేషన్ గడువు ముగిసినందున ఆయనను కేంద్రంలోని మాతృ శాఖకు పంపించాలని డిమాండ్ చేశారు.

10.కొత్త సీఈసీ గా రాజీవ్ కుమార్ బాధ్యతలు

భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

11.కెసిఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఈ నెల 18వ తేదీ భేటీ కానున్నారు.

12.అంబటి పై అయ్యాన్న సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు.అంబటి రాంబాబు సంస్కారహీనుడు అంటూ అయ్యన్న మండిపడ్డారు.

13.ఓర్వకల్లు రానున్న జగన్

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

ఏపీ సీఎం జగన్ ఈ నెల 17 వ తేదీన ఓర్వ కల్లుకి కు రానున్నారు.

14.జీపీఎస్ పై దీక్షకు అనుమతి నిరాకరణ

సిపిఎస్ కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జిపిఎస్ కు నిరసనగా ఆదివారం విజయవాడలో ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

15.మరో 48 గంటల్లో అండమాన్ కు నైరుతి రుతుపవనాలు

హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతం వైపు బలంగా రుతుపవన గాలులు వీస్తున్నాయి.దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

16.రేషన్ పంపిణీ ఆపరేటర్లు సమ్మె

లబ్ధిదారులకు పంపిణీ చేసే రేషన్ డోర్ డెలివరీ వాహనాల ఆపరేటర్లు సమ్మెబాట పడుతున్నారు.రాయితీ నగదు వసూలు చేయడం ప్రభుత్వ కడతానన్న భీమా ప్రీమియం భారాన్ని మోపడం,  సరైన సమయంలో చనిపోయిన ఆపరేటర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడం వంటి సమస్యలపై వారు ఆందోళన చేపట్టెందుకు వారు సిద్ధమవుతున్నారు.

17.  చింతమనేని ప్రభాకర్ పై కేసు  కొట్టివేత

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది.మహిళలపై దాడి చేశారని 2011లో ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదైంది.దీనిని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది.

18.రాజ్యసభ సీటుపై ఆదానీ క్లారిటీ

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

ఏపీ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్యా వాదాన్ని లేదా అతని భార్య ప్రీత్ ఆదానిలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారంటీ అంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.ఈ వార్తల్లో నిజం లేదని  ఆయన క్లారిటీ ఇచ్చారు.

19.సర్పంచ్ మౌనిక గోల్డ్ మెడల్

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద మరి వీడు సర్పంచ్ మౌనిక కు గోల్డ్ మెడల్ లభించింది.అనంతపురం జేఎన్టీయూ లో ఎంటెక్ ఈ ఈ ఈ  గ్రూప్ లో మౌనిక యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది.

20.  సీఐ పై కరాటే కళ్యాణి ఆగ్రహం

Telugu Bandi Sanjay, Corona, Gautham Adani, Karate Kalyani, Khammam, Pm Modi, Te

తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే ఇరువురు ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడతావా అంటూ సినీ నటి కళ్యాణి ఎస్.ఆర్.నగర్ సీఐ సైదులు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube